ఒకప్పుడు సౌత్ ఇండియా నటులు టాలీవుడ్ లో అవకాశాల కోసం నాన కష్టాలు పడేవారు. ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నా సరే ఇండియా లెవెల్ లో ప్రూవ్ చేసుకోవాలి అంటే కచ్చితంగా బాలీవుడ్ బెస్ట్ ఫ్లాట్ ఫామ్ అని భావించేవారు. అక్కడ హీరోయిన్లు ఇక్కడ నటించాలి అంటే ఎన్నో రకాలుగా రిక్వెస్ట్లు వెళ్లేవి. అగ్ర హీరోల సినిమాల్లో సైతం అక్కడ హీరోయిన్లు నటించడానికి ఆసక్తి చూపించేవారు కాదు. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో మన హీరోయిన్లను అక్కడ తీసుకునేవారు. మన సినిమాల్లో కూడా ఐటెం సాంగ్స్ కు అప్పుడప్పుడు అక్కడ హీరోయిన్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు.
Also Read : పల్నాడు జిల్లాపై కేంద్రం స్పెషల్ ఫోకస్
అయితే ఇప్పుడు ట్రెండ్ కంప్లీట్ గా మారిపోయింది. చాలామంది స్టార్ హీరోలు అలాగే హీరోయిన్లు టాలీవుడ్ తో పాటుగా సౌత్ ఇండియా సినిమాపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అక్కడి స్టార్ హీరోలు హీరోయిన్లు ఎక్కువగా ఇక్కడ ఛాన్సులు కోసం కష్టపడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు డైరెక్టర్లకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు. సన్నీడియోల్, బాబి డియోల్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్, దీపిక పదుకొనే, ఇలా చాలామంది తెలుగు వైపు చూస్తున్నారు.
Also Read : ఇక ఆ ఎమ్మెల్యే కథ ముగిసినట్లేనా..!
ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాతో అమితాబ్ కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా చావా సినిమాతో నెగిటివ్ రోల్ లో ప్రూవ్ చేసుకున్న అక్షయ్ కన్నా కూడా తెలుగు వైపు అడుగులు వేస్తున్నాడు. ఓ స్టార్ హీరో సినిమాలో అతనికి మంచి ఆఫర్ వచ్చింది. తెలుగు మార్కెట్ కోసం కష్టపడుతున్న అక్షయ్ ఈ ఛాన్స్ తో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలని తపిస్తున్నాడు. చూద్దాం మరి వీళ్ళందరూ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో .