Friday, September 12, 2025 10:35 PM
Friday, September 12, 2025 10:35 PM
roots

అఖిల్ కోసం.. పూరి స్టోరీ రెడీ.. నాగార్జున నమ్మకం అదే..?

చాన్నాళ్ళ నుంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యామిలీ ఎట్టకేలకు తండేల్ అనే సినిమాతో 100 కోట్ల సినిమా రుచి చూసింది. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి దాదాపు 120 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అల్లు అరవింద్ నిర్మాతగా వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా సరే తన తర్వాత సినిమాతో హిట్టు కొట్టి టాలీవుడ్ కు తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు.

Also Read : కోహ్లీతో రాహుల్ బాండింగ్ వేరే లెవెల్..!

ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో అక్కినేని అఖిల్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 20% కంప్లీట్ అయినట్టు టాక్. ఈ ఏడాది దసరా టైం కు సినిమాను రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ సినిమా తర్వాత అఖిల్.. పూరి జగన్నాద్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఎప్పటినుంచో దీనిపై ప్రచారం జరుగుతున్నా.. తాజాగా ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టేసాయి. అఖిల్ తండ్రి నాగార్జున.. పూరి జగన్నాథ్ తో మాట్లాడారని టాక్.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్…!

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాను నిర్మించేందుకు ఒప్పించారని.. దీనితో పూరి జగన్నాథ్ కూడా ఇప్పుడు ఒక పవర్ఫుల్ కథను రెడీ చేసుకుని అఖిల్ కు మంచి హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో నాగార్జునతో పూరి జగన్నాద్.. శివమణి, సూపర్ సినిమాలను చేశాడు. ఈ సినిమాల్లో శివమణి.. రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా ఎలా ఉన్నా హీరోని స్క్రీన్ పై ఏ రేంజ్ లో చూపించాలో పూరీకి ఓ క్లారిటీ ఉంటుంది. గత కొన్నాళ్ల నుంచి ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పూరి.. ఈ సినిమాతో లైన్లోకి రావాలని కష్టపడుతున్నాడు. అటు గోపీచంద్ హీరోగా కూడా ఒక సినిమాను ప్లాన్ చేసినట్లు ప్రచారం జరిగింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్