Tuesday, October 28, 2025 07:25 AM
Tuesday, October 28, 2025 07:25 AM
roots

కష్టాల క్రికెట్.. ఆకాష్ దీప్ జీవితంలో వరుస విషాదాలు

టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ బెంగాల్ బౌలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయాడు. గత ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ లో జట్టులోకి అడుగుపెట్టిన ఆకాష్ దీప్.. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక అయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా ఇబ్బంది పడ్డ ఆకాష్ దీప్.. ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ లో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

Also Read : మరాఠా గడ్డపై థాక్రేల హగ్ సెన్సేషన్

ఏ దశలో కూడా ఇంగ్లాండ్ ను కోలుకోనీయలేదు ఈ బౌలర్. ఇక అతని జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రెండు నెలల కాలంలో తండ్రిని, అన్నను కోల్పోయిన ఆకాష్ దీప్.. బీహార్ లో పుట్టినా సరే బెంగాల్ వెళ్ళే వరకు క్రికెట్ కెరీర్ మొదలు కాలేదు. క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో.. తన ఊరిలో తన తండ్రికి ఇష్టం లేకపోయినా క్రికెట్ ఆడిన అతను.. ఆ తర్వాత బెంగాల్ లోని దుర్గాపూర్ కు వెళ్ళాడు. అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే.. టెన్నీస్ బాల్ క్రికెట్ ఆడాడు.

Also Read : సినిమాల్లోకి మరో మాజీ స్టార్ క్రికెటర్

ముందు బ్యాట్స్మెన్ కావాలనుకున్న ఈ బౌలర్.. తన కోచ్ సూచనతో.. బౌలర్ గా ఎదిగాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గెస్ట్ హౌస్ లో ఉండటానికి కష్టమైనా సరే అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి ముందు క్లబ్ క్రికెట్ ఆడి.. ఆ తర్వాత రంజీ జట్టులోకి వచ్చాడు. ఇక అక్కడి నుంచి కెరీర్ ఊపందుకుంది. ఇంగ్లాండ్ లో చేసిన ప్రదర్శన తన అక్కకు అకింతం చేసాడు. ప్రస్తుతం తన సోదరి క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది అని.. ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని తెలిపాడు ఆకాష్ దీప్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్