Tuesday, October 28, 2025 06:56 AM
Tuesday, October 28, 2025 06:56 AM
roots

బ్లాక్ బాక్స్ డేటా డౌన్లోడ్.. ఎయిర్ ఇండియా ప్రమాదంలో కీలక పరిణామం

దేశ చరిత్రలో అత్యంత ఘోర విషాదాలలో ఒకటిగా చెప్పుకునే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్‌ ల నుండి సమాచారాన్ని విజయవంతంగా డౌన్‌లోడ్ చేసుకున్నామని, ఆ సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో బ్లాక్ బాక్స్‌ లు – ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ దెబ్బతిన్నాయి.

Also Read : కేసులంటే అంత భయం ఎందుకో..!

డేటాను ఫోరెన్సిక్ కోసం అమెరికా పంపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్, మెమరీ మాడ్యూల్‌ను పాడవకుండా.. మొత్తం డేటాను డౌన్‌లోడ్ చేసింది. విమానం కూలిపోయిన హాస్టల్ పైకప్పుపై ఒకటి, శిథిలాల నుండి మరొకటి దొరికాయి. వాటిని మంగళవారం ఢిల్లీలోని AAIB ల్యాబ్‌కు సురక్షితంగా తరలించినట్లు ప్రభుత్వం పేర్కొంది. డేటా డౌన్లోడ్ కావడంతో విమాన ప్రమాదానికి గలకారణాలు.. ఆ సమయంలో విమానంలో చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ కూడా బయటకు రానున్నాయి.

Also Read : మరో యాత్ర కూడా రెడీనా..?

కూలిపోయిన విమానంలో క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు చేసామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. నాలుగు నెలల కిందటే దాని కుడి ఇంజిన్‌ను మార్చామని ఎయిర్‌లైన్ వెల్లడించండి. ఏప్రిల్‌లో ఎడమ ఇంజిన్‌ను చెక్ చేసామని వివరించింది. విమానం మధ్యాహ్నం 1.39 గంటలకు బయలుదేరిందని ప్రభుత్వం ధృవీకరించింది. ముప్పై ఆరు సెకన్ల తర్వాత అది క్రాష్ అయింది. ఫ్లైట్ పైలెట్ సబర్వాల్ మేడే కాల్ ఇవ్వడానికి ముందు ఏం జరిగి ఉండవచ్చు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్