Monday, April 6, 2026 07:56 PM
Monday, April 6, 2026 07:56 PM

ఒక్క వీడియోతో ట్రెండ్ సెట్ చేసిన అన్నాడిఎంకే..!

రాజకీయాల్లో చేసే విమర్శలు వినూత్నంగా ఉంటేనే ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. ప్రజలకు జరుగుతోన్న అన్యాయాన్ని అర్ధమయ్యేలా వివరించాలి. ఈ విషయంలో తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడిఎంకే ఓ అడుగు ముందే ఉంది. ఎన్నికల వేళ స్టాలిన్ సర్కార్ పవేశ పెట్టిన బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ విమర్శలు సాధారణ రాజకీయ విమర్శల మాదిరిగా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున పూర్తి బడ్జెట్‌కు బదులుగా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది సర్కార్.

Also Read : ఏపీ క్యాబినెట్‌లో కొత్త పేరు ఖాయమా..?

దీనిపై అన్నాడీఎంకే దుమ్మెత్తిపోసింది. తాత్కాలిక బడ్జెట్‌ను విమర్శిస్తూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తీసుకువచ్చిన ఆహ్వాన పత్రిక అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబట్టింది. దీనిని చిన్న పిల్లలకు చెవులు కుట్టించే కార్యక్రమంగా అన్నాడిఎంకె ఆరోపించింది. ‘బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజలకు డీఎంకే ప్రభుత్వం చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహిస్తోంది’ అని ఆరోపిస్తూ ఓ ఆహ్వాన పత్రికను, ఓ వీడియోను రెడీ చేసింది.

Also Read : పాపం చేస్తే చివరి రోజే.. ఏపీ మార్క్ న్యాయం..!

ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. డిఎంకె నేతలు ప్రజలకు ఒక సూది పట్టుకుని, చెవులు కుడుతున్నట్లు వీడియో రెడీ చేసింది. ‘గ్రాండ్ ఇయర్ పియర్సింగ్ ఫెస్టివల్’ అంటూ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజల కోసం నిర్వహిస్తున్న ఈ గొప్ప చెవులు కుట్టే ఉత్సవం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరగనుందని తెలిపింది. తేదీ: ఫిబ్రవరి 17, 2026, స్థలం : తమిళనాడు శాసనసభ, సమయం: ఉదయం 10 గంటల నుండి ‘ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్. చెవులు కుట్టే కార్యక్రమానికి ఆర్థిక మంత్రి తంగం తమరసు నాయకత్వం వహిస్తారు’ అంటూ విమర్శించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అధికారుల తీరును బహిరంగంగా.....

అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ...

నరసరావుపేటలో వైసీపీలో రచ్చరచ్చ.....

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వైసీపీలో.....

సట్టా బజార్ షాకింగ్...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ...

ఏపీలో మరో రేపిస్ట్...

ఏపీలో అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం...

యుద్ధం.. అప్రకటిత లాక్...

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను...

లోకేష్ సింధనూరు యాత్రకు...

కర్ణాటకలోని సింధనూరులో ఏపీ ఐటీ, విద్యాశాఖ...

పోల్స్