ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొంత కాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేడు యుద్ధం దిశగా వెళ్ళాయి. రెండు దేశాలు పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాడులకు దిగాయి. దీనితో ఆఫ్ఘన్ పై పాకిస్తాన్ యుద్ధం ప్రకటించింది. ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’ పేరుతో పాక్ వైమానిక దాడులకు దిగింది. ఆఫ్ఘనిస్తాన్ కీలక నగరాలు అయిన కాబూల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్‌లో పాక్ వైమానిక దాడులు చేసింది. దీనికి ఆఫ్ఘన్ సైనికులు కూడా అదే స్థాయిలో బదులు ఇచ్చారు.
Also Read : మావో బాస్ కు రేవంత్ సర్కార్ ఘన సత్కారం..?
సరిహద్దుల్లో పాక్ సైనిక శిబిరాలపై ఆఫ్గాన్ భారీ దాడులకు దిగింది. ఆఫ్గాన్ దాడుల్లో 55 మంది పాక్ సైనికులు హతం అయినట్లు పాకిస్తాన్ ధృవీకరించింది. మొత్తం 13 అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్గానిస్థాన్ ప్రకటించింది. పాక్ పై తాము దాడులు చేసినట్టు ఆఫ్ఘన్ కూడా ధృవీకరించింది. గురువారం రాత్రి 8 గంటలకు ఆపరేషన్ ప్రారంభమైందని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్.. ఆఫ్ఘన్ భూభాగంలోకి చొరబడి మహిళలు, పిల్లల ప్రాణాలు తీసుకుందని ఆఫ్ఘన్ ఆరోపించింది.
Also Read : పెద్దల సభ కు రేవంత్ స్టైల్ లాబీయింగ్
ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ ప్రకారం, పాక్టికా, పాక్టియా, ఖోస్ట్, నంగర్హార్, కునార్, నురిస్తాన్ ప్రావిన్సుల సమీపంలోని డ్యూరాండ్ లైన్ వెంబడి తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లో ఆఫ్ఘన్ దళాలు సమన్వయంతో ఏకకాలంలో ఎదురుదాడులు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో కొందరు పాక్ సైనికులను బందీలుగా తీసుకున్నామని ఆఫ్ఘన్ సైన్యం తెలిపింది. కొంతమంది మృతదేహాలను ఆఫ్ఘనిస్తాన్‌కు తరలించామని పేర్కొంది. డజన్ల కొద్దీ, తేలికపాటి.. భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైనిక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది.

