Friday, September 12, 2025 07:31 PM
Friday, September 12, 2025 07:31 PM
roots

స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో.. కారణమేంటి?

తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విశాల్.. ఈమధ్య కాలంలో తరచుగా అనారోగ్యంతో కనిపిస్తుండటంతో ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గత ఏడాది ‘మదగజరాజ’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతుండగా ఆయన చేతులు మైక్ కూడా పట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతుండగా చేతులు వణికిపోవడం గమనించిన అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసారు. విశాల్ ఇలా ఎందుకు అయిపోయాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి నిజంగానే బాగుందా, ఆయనకు ఏమైంది అంటూ పరిశ్రమలో పెద్ద చర్చనే నడిచింది. అయితే ఆ సమయంలో హీరో విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో అలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చారు.

Also Read : తర్వాతి కెప్టెన్ ఎవరు..? ఆ ముగ్గురికే ఛాన్స్

ఆ తరువాత కొన్ని రోజులకి మరొక కార్యక్రమంలో విశాల్ బాగానే ఉండటంతో అతని ఆరోగ్యం మెరుగుపడిందని, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని వార్తలు వచ్చాయి. అభిమానులు కూడా సంతోషించారు. అయితే ఇప్పుడు మరోసారి హీరో విశాల్ స్టేజి మీదనే కుప్పకూలిపోవడం అందరినీ షాక్ కి గురిచేసింది అని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సమయంలో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని విల్లుపురం జరిగిన మిస్ విల్లుపురం ట్రాన్స్ జెండర్ పోటీలకు హీరో విశాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ పోటీలకు మాజీ మంత్రి పొన్ముది కూడా మరో అతిధిగా వచ్చారు. స్టేజి మీద కొంతమంది ట్రాన్స్ జెండర్లు విశాల్ తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ తమ స్టైల్ లో ఆయన్ని ఆశీర్వదించారు.

Also Read : సినిమాలు ఆగుతాయా..? ఆ సినిమాల రిలీజ్ ఎప్పుడు..?

విశాల్ కూడా నవ్వుతూ వాళ్ళ ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఎంతోమందికి ఆయన సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు కూడా ఇచ్చారు. ఇలా అంతా బాగుంది అనుకుంటున్నా సమయంలో ఒక్కసారిగా ఏమైందో ఏమో తెలియదు కానీ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఒక్కసారికి అక్కడికి వచ్చిన వాళ్లంతా షాక్ కి గురయ్యారు. వెంటనే సపర్యలు చేసి చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నదాని పై ఎలాంటి సమాచారం లేదు. అధికారికంగా డాక్టర్ల నుంచి ఎలాంటి హెల్త్ బులిటెన్ కూడా విడుదల కాలేదు. అయితే విశాల్ మేనేజర్ మాట్లాడుతూ.. “ఈ మధ్య కాలంలో విశాల్ సరిగా భోజనం తినడంలేదు. బాగా బలహీనంగా ఉన్నాడు. అందుకే అనారోగ్యానికి గురై ఉంటాడని భావిస్తున్నాము” అంటూ చెప్పుకొచ్చాడు. విశాల్ ఆరోగ్యం పై సరైన స్పష్టత లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్