Wednesday, February 4, 2026 02:35 PM
Wednesday, February 4, 2026 02:35 PM

కేటిఆర్ పక్కాగా బుక్ అయ్యాడు.. ఏసీబీ సంచలన అడుగులు

తెలంగాణాలో ఇప్పుడు ఏసీబీ అధికారులు వేస్తున్న అడుగులు సంచలనమవుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదు చేసింది ఈడీ. ఇక ఏసీబీ అధికారులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసారు. ఈడీ మరో రెండు రోజుల్లో కేటిఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నా సరే… ఈ రోజు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనపడుతోంది.

ఇప్పటికే పూర్తి ఆధారాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు.. ఈ మేరకు కేటిఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు. విచారణ ను ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ప్రారంభించింది. ఏసీబీ కేసుతో FEO వెనక్కు తగ్గింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో కేసును ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ వాపస్ తీసుకుంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించడంతో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వచ్చాయన్నది పూర్తిగా అవాస్తమని తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఫార్ములా ఈ రేస్ తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని లండన్ లోని ఆర్బిట్రేషన్ కు సర్కార్ స్పష్టం చేసింది.

Also Read : చంద్రబాబు భద్రత భారీగా కుదింపు.. ఎందుకో తెలుసా?

ఏసీబీ కేసును FEO కంపెనీ ఎదుర్కోవాలని ప్రభుత్వం హెచ్చరించడం గమనార్హం. దీంతో FEO కంపెనీ ఆర్బిట్రేషన్ లో కేసు వెనక్కి తీసుకున్నట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా లేకుంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ భారీగా ఫైన్ విధించేదని అధికారులు చెప్పడం గమనార్హం. ఇక ఈ కేసుకు సంబంధించి కేటిఆర్ పై ఫిర్యాదు చేసిన దాన కిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు అధికారులు. అటు ఈడీ కూడా కిషోర్ ను విచారించనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్