Friday, September 12, 2025 09:06 PM
Friday, September 12, 2025 09:06 PM
roots

వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రైతుబంధు దందా

రైతు బంధు పథకాన్ని అమలు చేసేందుకు గానూ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం నేడు విడుదల చేసింది. గతంలో ఈ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఆ లోటు పాట్లను గుర్తించిన రేవంత్ సర్కార్… ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు వ్యూహం సిద్దం చేసింది. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్బంగా రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమయ్యారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి రూ. 6000 చొప్పున పెట్టుబడి సాయం చేయనున్నారు.

Also Read : టీటీడీ సంచలన నిర్ణయం..? వారికి గుడ్ బై..?

వ్యవసాయ శాఖ అందించిన లెక్కల ప్రకారం చూస్తే ప్రతీ ఏటా వర్షాకాలంలో 1.49 కోట్ల ఎకరాలల్లో పంట సాగు అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక భారీ ఎత్తున అక్రమాలకూ బీఆర్ఎస్ పాల్పడిందని గుర్తించారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు బందు అక్రమాలు బయటపడ్డాయి. 28 వేల ఎకరాల అనర్హత భూములకు రైతు బంధు అందించారు. అర్హత లేని 28,980 ఎకరాల భూమికి రూ.174 కోట్ల రైతు బంధు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. గుట్టలు, ఇళ్ల స్థలాలు, సింగరేణి క్వార్టర్స్ చివరకు గుడి స్థలాలకు కూడా రైతు బంధు పంపిణీ చేసారు.

Also Read : మహిళలకు గుండెపోటు ఛాన్స్ ఏ టైం లో అంటే…?

అన్యాయంగా రైతు బంధు పొందిన వారిలో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే అధికంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. మహబూబాబాద్ జిల్లాలో – 8270 ఎకరాలు, ములుగు జిల్లాలో – 2870 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో – 2570 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో – 6400 ఎకరాలు, వరంగల్ జిల్లాలో – 2570 ఎకరాలు, జనగామ జిల్లాలో – 6300 ఎకరాలు అక్రమంగా నమోదు చేయించి రైతు బంధు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఎకరాలకుపైగా భూములు సాగు యోగ్యం కాదని తేల్చి.. వాటి సర్వే నెంబర్లను సైతం ప్రభుత్వం బ్లాక్ చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్