Friday, September 12, 2025 09:15 PM
Friday, September 12, 2025 09:15 PM
roots

బ్రేకింగ్: ఎన్డియేకి షాక్ ఇచ్చిన నితీష్

2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశం చూపు మొత్తం.. బీహార్, ఆంధ్రప్రదేశ్ పైనే. నితీష్ కుమార్ మద్దతు ఇస్తారా…? చంద్రబాబు ఎన్డియేతోనే ఉంటారా…? ఈ ప్రశ్నలు నేషనల్ మీడియాను షేక్ చేసాయి. చంద్రబాబు విషయంలో బిజేపి పెద్దలకు డౌట్ లేకపోయినా నితీష్ కుమార్ విషయంలోనే ఎన్నో అనుమానాలు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్థాడో తెలియని ఆయన గురించి బిజేపి పెద్దలు ముందు నుంచి భయపడుతూనే ఉన్నారు. ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read : ఫలించిన అమిత్ షా వ్యూహం.. వారికి కోలుకోలేని దెబ్బ..!

నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) మణిపూర్‌లో ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వానికి ఇబ్బంది లేకపోయినా.. నితీష్ కుమార్ మాత్రం ఏదో సిగ్నల్ ఎన్డియేకి ఇచ్చినట్టేననే అభిప్రాయాలు వినపడుతున్నాయి. మేఘాలయలో అధికారంలో ఉన్న కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ.. బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇప్పటికే ఉపసంహరించుకుంది. ఇప్పుడు నితీష్ కూడా షాక్ ఇచ్చారు.

Also Read : దావోస్ లో లోకేష్ స్పీడ్.. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్

మణిపూర్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడియూ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బిజేపిలో జాయిన్ అయ్యారు. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వానికి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతు ఇచ్చారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాలను జేడీయూ కైవసం చేసుకుంది. ఎన్డియే ప్రభుత్వ ఏర్పాటుకు ఈ 12 స్థానాలు కీలకంగా మారాయి. ఇక ఈ ఏడాది బీహార్ లో ఎన్నికలు ఉండటంతో పరిణామాలు కాస్త ఆసక్తికరంగా మారాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్