ఐఏఎస్ అధికారి ఆర్వింద్ కుమార్‌ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి కేటిఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలను ఆయనను అడిగినట్లు తెలుస్తోంది. స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది.. గ్రీన్ కో కంపెనీ తప్పుకునే ముందే మీకు సమాచారం అందిందా…? అందితే వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది అనే ప్రశ్నతో పాటుగా మరిన్ని కీలక ప్రశ్నలను అడిగారు అధికారులు. ఈ వ్యవహారంలో పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారనే ప్రశ్న కూడా ఆయనను అడిగినట్టు తెలుస్తోంది.
Also Read : ఫార్ములా ఈ రేస్ తో వైసీపీకి లింకులు..?
హెచ్ఎండీఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారని కేటిఆర్ ను ప్రశ్నించారు. ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదనే విషయం తెలియదా అనే ప్రశ్నలను అడిగినట్టు సమాచారం. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సింది పోయి విదేశీ కంపెనీలో ఒప్పందం ఎలా చేసుకున్నారని నిలదీసినట్టు తెలుస్తోంది. నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఎందుకు నివారించలేకపోయారని కేటిఆర్ ను అధికారులు ప్రశ్నించారు.
Also Read : రేవంత్ ను జాగ్రత్తగా తిట్టిన కేటిఆర్…!
గురువారం సాయంత్రం వరకు కేటీఆర్‌ను విచారణ జరిపి ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. హైకోర్ట్ ఆదేశాల మేరకే విచారణ జరుగుతోంది. లాయర్ ను అధికారులు అనుమతించలేదు. కాని లైబ్రరీ హాల్ నుంచి చూసే విధంగా ఏర్పాట్లు చేసారు. కనిపించేంత దూరంలో మాత్రమే న్యాయవాది ఉండాలని హైకోర్ట్ ఆదేశించడంతో వాటిని పాటిస్తున్నారు. బుధవారం అర్వింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు దాదాపు ఆరున్నర గంటలపాటు విచారించారు. ఈ ఫార్ములా కారు రేసులో దాదాపు రూ. 55 కోట్లు విదేశీ కంపెనీ ఎఫ్ఈవోకు బదిలీ జరిగిందో వాటిపైనే ఎక్కువగా కేటిఆర్ ను ప్రశ్నించారు.