ఆంధ్రప్రదేశ్ లో క్రీడారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. క్రీడల్లో యువతను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన క్రీడా పాలసీకి శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో హర్యానా తరహా క్రీడ పాలసీని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు మొదలు పెట్టింది. ప్రధాన క్రీడల్లో యువతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఒలంపిక్స్ ను అలాగే భారత క్రికెట్ టీం ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
Also Read : నేను తగ్గను.. బెనిఫిట్ షోస్ ఉండవు: రేవంత్ క్లారిటీ
ఈ నేపథ్యంలో ప్రభుత్వమే క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఒక ప్రైవేట్ సంస్థతో కలిసి రాష్ట్రంలో క్రికెట్ ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కీలక మార్పులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని నియమించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read : జగన్‌కు తలనొప్పిగా మారిన కడప..!
ఈ నేపథ్యంలోనే విశాఖ, విజయవాడ, చిత్తూరు, రాజమండ్రి ప్రాంతాల్లో ప్రభుత్వం క్రీడా మైదానాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అటు భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే ఒలంపిక్స్ కు యువ ఆటగాళ్లను వదిలిపెట్టే దిశగా ప్రభుత్వమే రంగంలోకి దిగనుంది. గతంలో కూడా చంద్రబాబు క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. అటు పుల్లెల గోపిచంద్ తో కూడా ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టింది.