Friday, September 12, 2025 10:52 PM
Friday, September 12, 2025 10:52 PM
roots

మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. నా కొడుకుని ఆదుకోలేదు…!

దేవర సినిమా రిలీజ్ టైం లో ఎన్టీఆర్ అభిమాని ఒకరు తిరుపతిలో… దేవర సినిమా చూసి చచ్చిపోతాను నాకు ఆరోగ్యం బాగాలేదు అంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం గుర్తు ఉండే ఉంటుంది. అతని వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తా అంటూ ఆ తర్వాత వీడియో కాల్ మాట్లాడి ఎన్టీఆర్ చెప్పిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. అయితే అదంతా బొంబాయి హామీనే అని ఆ అభిమాని తల్లి ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా ఓ ఛానల్ తో మాట్లాడిన ఆమె… అసలు తన కొడుకుకు ఏ సహాయం చేయలేదని బయటపెట్టారు.

తన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అని… క్యాన్సర్ తో బాధపడుతుండగా చావు బతుకుల మధ్య ఉన్న తన కొడుకుని ఆదుకుంటానంటూకు హామీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్… సహాయం చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటికి ఎలాంటి సాయం చేయాలేదని…కోడుకు కాపాడాలని ఆమె వేడుకున్నారు. గతంలో బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కౌశిక్ తో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడి హామీ ఇచ్చినా అడుగు ముందుకు పడలేదు. ఎపి ప్రభుత్వం 11 లక్షల రూపాయిలు, మరియు టీటీడీ ఇచ్చిన ఆర్థిక సాయంతో కౌశిక్ కు ఇప్పుడు ఆపరేషన్ పూర్తి చేసారు.

Also Read : ఏపీపై రైల్వే శాఖ వరాల జల్లు..!

మరో 20 లక్షల రూపాయల ఆసుపత్రి ఫీజులు చెల్లించాల్సి ఉండగా… దాని కోసం అవస్థలు పడుతోంది కౌశిక్ కుటుంబ సభ్యులు. ఇంకా చెన్నై అపోలో ఆస్పత్రిలో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు. 77 లక్షలు ఇవ్వాల్సి ఉండగా…చివరికి ఇరవై లక్షలు అందిస్తే డిశ్చార్జ్ చేస్తామని అపోలో ‌‌స్పష్టం చేసింది. సహాయం చేస్తామన్న ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా… ఫలితం లేదని కౌశిక్ తల్లి ఆవేదన వ్యక్తం చేసారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందన లేదని సరస్వతి వివరించారు. హామీ ఇచ్చి ఇప్పటికి ఎలాంటి సహాయం చేయలేదని తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్