ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా వైసీపీ పెద్దల ఆదేశాలతో రెచ్చిపోయిన చాలామంది అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చాలామంది ఆశపడ్డారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అలాగే సామాన్య ప్రజలను వేధించిన అధికారుల విషయంలో నారా లోకేష్ రెడీ చేసిన రెడ్ బుక్ కచ్చితంగా ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కాస్త పరిస్థితి కామెడీగా అనిపిస్తోంది. చాలామంది అధికారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
Also Read : అమరావతి రైల్వే లైన్ పనులు షురూ.. కానీ కోర్ట్ చిక్కులు ఇవే..!
ముందు కొన్ని కేసులతో అధికారులను భయపెట్టి హడావుడి చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు మాత్రం వాళ్ల విషయంలో చాలా సైలెంట్ గానే కనబడుతోంది. ముంబై నటి జత్వాని కేసు విచారణలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వాళ్లపై కఠినంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. అందులో ముఖ్యంగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉంటుందని భావించారు.
ఆయన అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను చాలా వరకు వేధించారు అని ఆరోపణలు ఉన్నాయి. జగన్ కు నమ్మిన బంటుగా కూడా ఆయన వ్యవహరించారని చెప్తూ ఉంటారు. అలాంటి సీతారామాంజనేయులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలకు దిగలేదు. తాజాగా హైకోర్టు కూడా ఈ విషయంలో ఆశ్చర్యమే వ్యక్తం చేసింది. జత్వాని కేసు విషయంలో హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ పిటీషన్ ను ఐపీఎస్ అధికారులు కాంతిరాన అలాగే విశాల్ గున్నీ దాఖలు చేశారు.
ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఇప్పటివరకు కేసులో ఏ 2గా ఉన్న ఐపీఎస్ సీతారామాంజనేయులును ఎందుకు అరెస్టు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు కదా అని ప్రభుత్వా న్యాయవాదిని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనితో ఈ వార్త ఇప్పుడు టిడిపి సర్కిల్స్ లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సీతారామాంజనేయులు ధైర్యంగా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయకుండా ఉన్నారంటే ఆయనను కాపాడుతుంది కూటమి ప్రభుత్వం లేక మరెవరైనానా అంటూ టిడిపి కార్యకర్తలు ఫైర్ అయిపోతున్నారు.
Also Read : వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత.. లైన్ క్లియర్..!
సీతారామాంజనేయులు అప్పట్లో ఎన్నో ఆగడాలు చేసి ఇప్పుడు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, కనీసం ఆయన డిజిపి ఆఫీసు కూడా వెళ్లడం లేదని, వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఆయనను అందరూ భావిస్తున్న సరే ఆయన తప్పు చేసినట్టు సాక్ష్యాలు ఉన్న సరే పోలీస్ శాఖ ఎందుకు ముందడుగు వేయలేకపోతోంది అంటూ ఫైర్ అవుతున్నారు.