Sunday, September 14, 2025 02:26 AM
Sunday, September 14, 2025 02:26 AM
roots

పాపం టమాట రైతులు.. రేటు ఎంతంటే..?

పది రోజుల క్రితం వరకు టమాట పంట కాసులు కురిపించింది. వర్షాలకు ఖరీఫ్‌లో దిగుబడులు బాగా వచ్చాయి. దీనికి తోడు మంచి ధరలు పలకడంతో టమాట రైతులకు లాభాల పంట పడింది. కట్ చేసి చూస్తే టమాట ధరలు అమాంతం పడిపోయాయి. రూపాయికి కూడా కిలో కొనే నాథుడు కనిపించడం లేదు. పెట్టుబడి సంగతి సరేసరి.. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

Also Read: ఫ్యూచర్ లో కూడా ఏకగ్రీవమే… బీటెక్ రవి స్ట్రాంగ్ వార్నింగ్

కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో ఆశించినంతగా టమాట దిగుబడులు రాలేదు. మరోవైపు గిట్టుబాటు ధర కల్పించి టమాట రైతులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కర్నూలు జిల్లా టమాట రైతులు భారీగా నష్టపోయి.. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో గతం కంటే ఈ ఏడాది కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా 7 వేల 230 హెక్టార్లలో రైతులు టమాట పంట సాగు చేశారు. వర్షాలకు భారీగా దిగుబడులు వచ్చాయి.

జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో జూలై ఆఖరి నుంచి టమాటా క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచి కిలో టమాట రూ.20, 30, 40, 50 రూపాయల దాకా పలికింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అయితే ఏకంగా క్వాలిటీగా ఉన్న టమోటా కిలో రూ.100కు కూడా చేరుకుంది. ఓవైపు దిగుబడులు భారీగా రావడం గిట్టుబాటు ధర బాగా ఉండటంతో రైతుల కష్టాలు తీరాయి. పెట్టుబడి ఖర్చులు.. కోత కూలీలు, రవాణా చార్జీలు పోను మంచి లాభాలు దక్కాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరుతాయనుకున్నారు. ఈ ఏడాది పత్తికొండ మార్కెట్‌కు పెద్ద ఎత్తున టమోటా ఉత్పత్తులు వచ్చినా ధరలు మాత్రం తగ్గలేదు. దీంతో రైతులు అప్పుల గండం నుంచి గట్టెక్కారు.

Also Read: జమిలీపై చంద్రబాబు హాట్ కామెంట్స్

ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో వేసిన టమాటా పంట కాలం ముగిసింది. రైతులు చివరి పంట కోత కోస్తున్నారు. ముఖ్యంగా వర్షాధారం కింద వేసిన టమాటాలు నిమ్మకాయ సైజులో ఉన్నాయి. వ్యవసాయ బావులు, బోర్లు కింద సాగు చేసిన టమాట ఉత్పత్తులు మధ్యరకం, పెద్ద సైజులో ఉన్నాయి. పత్తికొండ మార్కెట్‌లో మధ్యరకం కిలో రూ.20, బిగ్ సైజ్ కిలో రూ.30 పలుకుతున్నాయి. అయితే సన్నరకం టమాటాలకు సరైన ధర లభించడం లేదు. గోలీలు, నిమ్మకాయ సైజులో టమాటాలు ఉండడం వల్ల వ్యాపారులు వాటిని కొనడం లేదు. పత్తికొండ మార్కెట్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన టమాటాలను హైదరాబాద్, బెంగళూరు,చెన్నై, వరంగల్, విజయవాడ, మధురై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అయితే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రబీ సీజన్లో వేసిన టమాటాలు మార్కెట్లకు పెద్ద ఎత్తున వస్తున్నాయి. క్వాలిటీ టమాటా ఉత్పత్తులు అక్కడి మార్కెట్లకు రావడంతో కర్నూలు నుంచి వెళ్లే సన్న రకం టమోటాలకు ధర లేకుండా పోయింది. దీనివల్ల పత్తికొండ మార్కెట్లో వ్యాపారులు సన్నరకం టమాటా ఉత్పత్తులను కొనడం లేదు.

Also Read: మోడీ 1… బాబు 2… జగన్ 3… ముగ్గురూ ముంచేశారు

వారం రోజులుగా పత్తికొండలో స్మాల్ సైజ్ టమాట ధర కిలో రూపాయి మాత్రమే పలుకుతోంది. దీనితో రైతులకు రవాణా ఛార్జీలు కూడా రావడం లేదు. ఆరుగాలం కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అమ్మకానికి తెచ్చిన టమాటాలను మార్కెట్ లోనే పారబోస్తున్నారు. టమాటా సాగుకు ఎకరాకు రూ.20 నుంచి 25 వేల వరకు పెట్టుబడి అవుతుంది. టమాటాలను కోసేందుకు ఒక కూలికి రోజుకు రూ.300 ఇవ్వాలి. 20 కిలోల టమాటా గంప పొలం నుంచి మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు ఆటో బాడుగ రూ.20 అవుతుంది. మరి మార్కెట్లో కిలో టమాట కేవలం రూపాయి పలికితే… తెచ్చిన టమాటాలను అన్నింటిని అమ్మితే… 10 శాతం కమిషన్ పోను చేతికి చిల్లి గవ్వ కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

స్మాల్ సైజ్ టమాటాలు మాత్రమే కిలో రూపాయి పలుకుతున్నాయని…. మధ్యరకం, బిగ్ సైజ్ టమాటాలు కిలో రూ.20 నుంచి 30 ధర ఉందని మార్కెట్ సిబ్బంది తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నింగికి ఎగిసిన టమాటా ధరలు ప్రస్తుతం నేల చూపుచూస్తున్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని న అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్