సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసాడు. అతను ఏమైనా దేశం కోసం సరిహద్దుల్లో పోరాడాడా అంటూ అల్లు అర్జున్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆజ్ తక్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్… అల్లు అర్జున్ అరెస్టు పై కీలక వ్యాఖ్యలు చేసారు. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లు ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటూ ప్రశ్నించిన రేవంత్… అల్లు అర్జున్ అరెస్టు చేసామంటున్నారు.. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడన్నాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కుటుంబం తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, ఈ దేశంలో సల్మాన్ ఖాన్ , సంజయ్ దత్త్ అరెస్ట్ అవ్వలేదా..భారత్ దేశంలో రాజ్యాంగం అందరికీ ఒక్కటే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగలిగారు.. మరి ఆర్జీవీని..? లోపం ఎక్కడుంది?
జరిగిన దురదృష్టకర ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందని పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారని తెలిపారు రేవంత్. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అని నిలదీశారు. ఒకవేళ నమోదైన కేసు పై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే అప్పుడు మీరే మమ్మల్ని నిందిస్తారని పేర్కొన్నారు. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదన్నారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది.. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావిడి చేశాడన్నారు రేవంత్. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదన్నాడు. సరైన ఏర్పాట్లు లేకుండా అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చాడు. అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో A11 గా పోలీసులు పెట్టారని… అక్కడ మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులని నిలదీశారు.
Also Read: పుష్ప అరెస్ట్… పొలిటికల్ మైలేజ్ కోసం ఆరాటం…!
నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు… అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత, అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత .. నాకు బంధువు అన్నారు. అల్లు అర్జున్ భార్య మాకు బంధువని తెలిపారు. పుష్ప సినిమాకు 300 టికెట్ ధర 1300 చేసేలా బెనిఫిట్ షో పర్మిషన్ మేమే ఇచ్చాం ఆని గుర్తు చేశారు. హోం శాఖ నా వద్ద ఉంది, ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ నాకు తెలుసన్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడని సినిమా కోసం పైసలు పెట్టారు పైసలు సంపాదించారని వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.




