టీమిండే కెప్టెన్ రోహిత్ శర్మ గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు ఆటపరంగా ఇటు కెప్టెన్సీ పరంగా రోహిత్ అభిమానుల నుంచి అటు జట్టు యాజమాన్యం నుంచి తీవ్ర ఒత్తిడి లో ఉన్నాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ పై క్లీన్ స్వీప్ ఓటమి అలాగే ఆస్ట్రేలియాపై రెండో టెస్టుల ఘోరంగా ఓడిపోవడం పట్ల ఇప్పుడు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ స్థాయికి ఆ స్థాయి ప్రదర్శన ఏమాత్రం కూడా సరిపోలేదు. రెండు ఇన్నింగ్స్ లో కీలకమైన సమయంలో రోహిత్ వికెట్ చేజార్చుకున్నాడు.
Also Read : తనకు క్రికెట్ కంటే చదువే ముఖ్యం అంటున్న స్టార్ క్రికెటర్
అలాగే కెప్టెన్సీ పరంగా కూడా గొప్ప నిర్ణయాలు కనపడలేదు. ఒకానొక దశలో రోహిత్ కెప్టెన్సీ చేసే సమయంలో ఇబ్బంది పడినట్టుగా కనిపించింది. అందుకే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు మైదానంలో. ఆస్ట్రేలియా ఆటగాళ్లు వేగంగా ఆడుతుంటే రోహిత్ శర్మ మౌనంగా అలా చూస్తూ ఉండిపోయాడు. దీనితో ఇప్పుడు రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్లు సలహాలు ఇస్తున్నారు. కొన్నాళ్ళు రోహిత్ శర్మ రెస్టు తీసుకుంటే మంచిదని… ఈ సీరీస్ లో రోహిత్ ఆడకుండా ఉండటమే జట్టుకు కలిసి వచ్చే అంశం అని సూచిస్తున్నారు.
Also Read : మనోజ్ ను ఇంత దారుణంగా కొట్టారా…? గోళ్ళతో గీరింది ఎవరు…?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫై దృష్టి పెట్టి రోహిత్ తన ఆటను మెరుగుపరుచుకోవాలని అదేవిధంగా కెప్టెన్సీను బూమ్రాకు అప్పగించి సైలెంట్ గా ఉండటం మంచిది అంటూ పలువురు సూచిస్తున్నారు. మొదటి టెస్ట్ లో బూమ్రా అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. కాబట్టి మూడో టెస్ట్ నుంచి తప్పుకోవాలని పలువురు సూచిస్తున్నారు. నాలుగు టెస్టులు వరుసగా రోహిత్ కెప్టెన్సీ లో భారత్ ఓడిపోయింది. దీనితో రోహిత్ కూడా ఒకరకంగా ఒత్తిడిలోనే కనిపిస్తున్నాడు. బౌలర్ల ప్రదర్శన కూడా రెండో టెస్టులో ఆశించిన స్థాయిలో లేకపోవడం రోహిత్ ను మరింత ఇబ్బంది పెట్టింది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన సరే రోహిత్ గొప్పగా ఏం రాణించలేదు.