గత మూడు నాలుగు నెలలుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. మీడియా వర్గాల్లో కూడా అతని గురించి ఏ వార్త వచ్చినా హాట్ టాపిక్ గానే మారింది. తన దగ్గర పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ను ఆయన అత్యాచారం చేశారంటూ ఒక కేసు నమోదయింది. ఇక అక్కడి నుంచి ఆయన టార్గెట్ గా మీడియాలో అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇక అటు సినిమా పరిశ్రమంలో కూడా ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితుల ఎదురవుతున్నాయి. ఇటు జనసేన పార్టీ నుంచి కూడా ఆయనను సస్పెండ్ చేయడం సంచలనమైంది.
Also Read : మనోజ్ ను ఇంత దారుణంగా కొట్టారా…? గోళ్ళతో గీరింది ఎవరు…?
బెయిల్ పై ఈ కేసులో బయటకు వచ్చిన జానీ మాస్టర్ ప్రస్తుతం మళ్ళీ తన కెరీర్ పై దృష్టి సారిస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తరుణంలో ఒక వార్త బయటకు వచ్చింది. తెలుగు సినిమా డ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఆయనను సస్పెండ్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు కొరియోగ్రఫీ అసోసియేషన్ లో జరిగిన ఎన్నికల్లో గెలిచినవారు ఆయనను సస్పెండ్ చేశారంటూ ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా జానీ మాస్టర్ వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చాడు.
Also Read : ఆకట్టుకుంటున్న రానా దగ్గుబాటి షో.. అక్కినేని, దగ్గుబాటి కిడ్స్ సందడి
అసలు తనను ఎవరూ యూనియన్ నుంచి సస్పెండ్ చేయలేదని సోషల్ మీడియాలో పుకార్లు నమ్మవద్దంటూ జానీ మాస్టర్ కోరాడు. నిర్ధారణ లేని ఆరోపణలు సాకుగా చూపిస్తున్నారని జానీ మాస్టర్ ఫైర్ అయ్యాడు. శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్లు పుకార్లు పుట్టిస్తున్నారని తన పదవీకాలం ఇంకా ఉంది అంటూ జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చాడు. అనధికారికంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారని హోదాలను లాక్కునే హక్కు ఎవరికీ లేదు అంటూ జానీ మాస్టర్ స్పష్టం చేశాడు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా ముందుకు వెళుతున్నాను అని ప్రకటించాడు. టాలెంట్ ఉన్న వారిని ఎవరు ఆపలేరని ప్రస్తుతం తాను రాంచరణ్ సినిమా గేమ్ చేంజర్ కోసం ఒక పాటను కొరియోగ్రఫీ చేశానని ఆ పాట త్వరలోనే విడుదల కానుంది అంటూ కూడా జానీ మాస్టర్ ప్రకటించాడు.




