ఆంధ్రప్రదేశ్ లో మెట్రో రైలు పరుగులకు రంగం సిద్దమైంది. ఇన్నాళ్ళుగా పడకేసిన మెట్రో ప్రాజెక్ట్ లు ఇప్పుడు స్పీడ్ అందుకోనున్నాయి. రాజధాని అమరావతి, ఆర్ధిక రాజధాని విశాఖలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. విజయవాడ మెట్రో రైల్ డీపీఆర్కు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని రెండు దశల్లో (కారిడార్ 1ఎ, 1బిగా) మొత్తంగా 38.4కి.మీ మేర నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్ ని మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా.. ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసారు.
Also Read : దందాకు బొంద పెట్టేందుకు రెడీ
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తంగా రూ.11,009 కోట్ల మేర కారిడార్ 1ఎ, బి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచనలో ఉంది. భూసేకరణ కోసం రూ.1152 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా డీపీఆర్ ను సిద్ధం చేసారు. విజయవాడ మెట్రోలో రెండో దశలో భాగంగా మూడో కారిడార్ను దాదాపు 27.75కి.మీల మేర నిర్మించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 1ఎ కారిడార్లో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు నిర్మాణం చేపడతారు. విమానాశ్రయానికి, బస్టాండ్ కు లింక్ చేయనున్నారు.
1బిలో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు నిర్మాణం చేపడతారు. అంటే విమానాశ్రయం టూ రాజధాని వయా బస్టాండ్. మూడో కారిడార్ ను రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ను ఆమోదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేసారు.
Also Read : టిడిపిలో తీగల చేరిక ముహుర్తం ఖరారు…!
అలాగే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు.. గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీసుకు 5.08 కిలోమీటర్లు.. తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ 6.75 కిలోమీటర్లు.. ఈ మూడు లైన్లు ఫేజ్ 1గా కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లు రెండవ ఫేజ్‌లో పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ్చేసింది. మొత్తం 76.9 కిలోమీటర్లు మెట్రోరైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.