Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

దుమ్ము రేపారు… ఆస్ట్రేలియాకు పగలే చుక్కలు

పెర్త్ వేదికగా జరుగుతున్న… బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్‌ లో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాపై 46 పరుగుల లీడ్ సాధించిన టీం ఇండియాకు ఓపెనర్లు కెఎల్ రాహుల్, జైస్వాల్ కళ్ళు చేదిరిపోయే ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా ఆల్ అవుట్ కాగా… చివరి రెండు సెషన్‌లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత్ బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆస్ట్రేలియా గడ్డపై తొలి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు.

Also Read : కంగారులను కంగారు పెట్టేసారు… చుక్కలు చూపించిన పేస్ త్రయం

రాహుల్ కూడా తన అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్నాడు. మ్యాచ్ ముగిసే సమయానికి రాహుల్ 62 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. వీరిద్దరూ 2వ రోజు ముగిసే సమయానికి భారత్ కు మంచి ఆధిక్యం అందించారు. 172 పరుగులు చేసిన ఈ జోడీ… ఆధిక్యాన్ని 218 పరుగులకు పెంచింది. ఇంకా 10 వికెట్లు చేతిలో ఉన్నాయి. దీనితో భారత్… భారీ లక్ష్యాన్ని ఆసిస్ ముందు ఉంచే అవకాశం కనపడుతోంది. ఇక పిచ్ స్వభావం క్రమంగా మారుతోంది. మొదటి రోజు 17 వికెట్ లు పడితే రెండవ రోజు కేవలం మూడు మాత్రమే పడ్డాయి.

Also Read : బరితెగించిన నాటి జగన్ సర్కార్.. ఇదిగో మరో ఆధారం

క్రమంగా బ్యాటింగ్ అనుకూలిస్తున్న పిచ్ పై పగుళ్ళు పెరిగే అవకాశం ఉంది. పెర్త్ లో ఎండ తీవ్రత పిచ్ పై పగుళ్ళకు కారణం కానుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగి… ఆస్ట్రేలియా పతనం శాసించాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్… క్రమంగా మ్యాచ్ లో విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో క్రీజ్ లో నిలబడటానికి ఇబ్బంది పడ్డ యువ ఓపెనర్ జైస్వాల్… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దుమ్ము రేపాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్