Monday, October 27, 2025 07:52 PM
Monday, October 27, 2025 07:52 PM
roots

వీరు పార్టీ మారడం వెనుక ఇంత స్వార్ధం ఉందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు నేతల తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందు వరకు ఫుల్ యాక్టివ్‌గా ఉన్న నేతలంతా… ఇప్పుడు కనీసం కనిపించకుండా పోయారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించారు… పైగా అధినేతను మెప్పించేందుకు ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోశారు. అయితే పార్టీ ఓడిన తర్వాత వారి రాజకీయ వారసుల భవిష్యత్తు కోసం కొత్త దారులు వెతుకున్నారు. అందులో భాగంగానే వైసీపీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా జనసేనలో చేరిపోయారు. అయితే అలా చేరిన తర్వాత ఏమయ్యారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది.

వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, విప్ సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య సహా పలువురు నేతలు ఇప్పుడు ఏమయ్యారు అనేది అంతుచిక్కని ప్రశ్న. వాస్తవానికి ఎన్నికల ముందు నేతలు పార్టీ మారడం సర్వ సాధారణం. తమ రాజకీయ భవిష్యత్తు కోసం, నియోజకవర్గంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేతలు పార్టీలు మారుతుంటారు. అలా వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి మాజీ మంత్రి గుమ్మనూరి జయరాం, ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారధి, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎంపీ వరప్రసాద్ సహా పలువురు నేతలు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం మాజీ ఎంపీ వరప్రసాద్ మినహా మిగిలిన వారంతా గెలిచారు. అలాగే గతంలో జగన్ చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు.

Also Read : పారితోషికం లోనూ అన్ స్టాప‌బుల్ గ దూసుకెళ్తున్న బాలయ్య

అయితే ఎన్నికల తర్వాత పార్టీ మారిన బాలినేని, సామినేని, కిలారు వంటి నేతలు మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఏమయ్యారో… ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. వాస్తవానికి వీరంతా పార్టీ మారుతున్న సమయంలో స్థానిక నేతలతో పాటు కూటమి నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే… పవన్ మాత్రం వారికి జనసేన కండువా కప్పారు. అయితే ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా కూడా ఈ నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం జగన్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ చిన్న ప్రెస్‌నోట్ కూడా విడుదల చేయలేదు.

బాలినేని తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారినట్లు చెబుతుండగా… సామినేని ఉదయభాను మాత్రం అల్లుడి బావ కోసం జనసేన కండువా కప్పుకున్నారనేది బహిరంగ రహస్యం. గనుల శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఏసీబీ కేసులో అరెస్టు అయిన వెంకట రెడ్డి… సామినేని ఉదయభాను అల్లుడికి బావ అవుతారు. దీంతో వెంకటరెడ్డిని కాపాడేందుకు తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ మారిన తర్వాత కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కనీసం ఒక్క కార్యక్రమంలో కూడా ఈ నేతలు పాల్గొనలేదు. చివరికి జిల్లాస్థాయి నేతలతో భేటీ అయిన సందర్భాలు లేవు. దీంతో అసలు వీళ్లు ఎందుకు పార్టీ మారారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్