ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయినా… వైఎస్ జగన్ తీరులో మాత్రం మార్పు రావడం లేదు అనే విషయం ఈ మధ్య కాలంలో ఆయన నిర్ణయాలు చూస్తే స్పష్టంగా అర్ధమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు… సలహాదారులు ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి జగన్ బాధ్యతలు అప్పగించారు. వారికి పెద్ద పీట వేయడంతో ఇతర సామాజిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా సరే అధికారం కోల్పోయిన తర్వాత జగన్ అదే బాటలో వెళ్తున్నారు.
Also Read : బరితెగించిన నాటి జగన్ సర్కార్.. ఇదిగో మరో ఆధారం
రెడ్డి సామాజిక వర్గానికి పదవులను పెద్ద ఎత్తున కట్టబెడుతున్నారు. పార్టీ బాధ్యతలను రాయలసీమలో పెద్దిరెడ్డికి… ఉభయగోదావరి కృష్ణా, గుంటూరు, జిల్లాల్లో వైవీ సుబ్బారెడ్డికి… ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డికి అప్పగించడం చూసి ఆ పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా కమ్మ సామాజిక వర్గ నేతల ఆధిపత్యం ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల బాధ్యతలను మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించారు జగన్. ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
Also Read : ఇక సెలవ్.. పోసాని సంచలన నిర్ణయం
ఉమ్మడి కర్నూలు, వైయస్ఆర్ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనంగా ఈ బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి కృష్ణాజిల్లా బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు అదనంగా కృష్ణా జిల్లా బాధ్యతలను సైతం వైవీ సుబ్బారెడ్డికి అప్పగించడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు పేర్ని నానీ, కొడాలి నానీ వంటి వారు ఉన్నా సరే… గుంటూరు జిల్లాలో పలువురు ఇతర సామాజిక వర్గ సీనియర్ నేతలు ఉన్నా… రెడ్లకు బాధ్యత అప్పగించడం ఏంటీ అంటూ వైసీపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.