Saturday, September 13, 2025 07:05 AM
Saturday, September 13, 2025 07:05 AM
roots

ఆ డ్రగ్స్ ఎక్కడివి..? విజయ్ మద్దూరి ఫోన్ దొరికితే..!

జాన్వాడ ఫాం హౌస్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఈ పార్టీని ఏ కోణంలో నిర్వహించారు అనే దానిపై చాలా సందేహాలు ఉన్నాయి. మీడియాలో కూడా దీనిపై పెద్ద హడావుడి జరుగుతోంది. ఇక కేటిఆర్ మీడియా సమావేశం తర్వాత ఆనేక ప్రశ్నలకు జవాబులు వెతుకుతున్నారు జనాలు. ఈ నేపధ్యంలో పోలీసుల దర్యాప్తు ఆసక్తికరంగా మారింది. నోటీసులు ఇచ్చినా… విచారణకు విజయ్ మద్దూరి, రాజు పాకాల హాజరు కాకపోవడం పట్ల పోలీస్ శాఖ సీరియస్ గా ఉంది.

నేడు రాజ్ పాకాల విచారణకు హాజరవుతాడా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు పోలీసుల ముందు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం ఇవ్వాలని హై కోర్ట్ ఆదేశించింది. విచారణలో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వం హైకోర్ట్ కు తెలిపింది. నిభంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని పోలీసులకు హై కోర్ట్ ఆదేశించడంతో ఏం జరుగుతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. పోలీసుల విచారణకు న్యాయవాదినితో వెళ్ళచ్చు అని హై కోర్ట్ క్లారిటీ ఇచ్చింది.

Also Read: కేటీఆర్ ప్రవర్తనతో బలపడుతున్న అనుమానాలు

మోకిలా పోలీసుల విచారణకు విజయ్ మద్దూరి నుంచి ఏ మాత్రం సహకారం లేదని తెలుస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని విజయ్ మద్దూరి అందుబాటులో లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. తను వాడుతున్న మొబైల్ ఫోన్ తో విచారణకు హాజరు కావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. పార్టీ జరిగే రోజు తన ఫోన్ బదులు వేరే మహిళ ఫోనును పోలీసులకు విజయ్ మద్దూరి ఇవ్వడం గమనార్హం.

Also Read: రోధిస్తున్న తల్లి.. క్షోభిస్తున్న వైఎస్ఆర్ ఆత్మ..!

తన ఫోన్ ఇవ్వాలంటూ మొకిలా పోలీసులను మహిళ ఆశ్రయించారు. రేపు మహిళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఫోన్ ను తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. విజయ్ మద్దూరి డ్రగ్ పాజిటివ్ రావడంతో డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఈ కేసులో అసలు విజయ్ మద్దూరినే కీలకమా లేక మరెవరు అయినా ఉన్నారా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో దీని పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్