Saturday, September 13, 2025 06:31 PM
Saturday, September 13, 2025 06:31 PM
roots

బీఆర్ఎస్ పని అయిపోయిందా?

2020 లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు గుర్తున్నాయా…? అసలు కాంగ్రెస్ అనేది ఓ రాజకీయ పార్టీనే కాదు, పోటీలో లేనే లేదు, అసలు పోటీలో ఉన్నదీ బీఆర్ఎస్ మరియు బిజెపి మాత్రమే, మజ్లీస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది… అంటూ అప్పట్లో బీఆర్ఎస్ ఆడిన గేమ్ ప్లాన్ గుర్తుందా…? రాజకీయాలను సున్నితంగా గమనించే వారికి ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. అధికారం శాశ్వతం అనుకున్నారో ఏమో గాని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను సోదిలో లేకుండా చేసే ప్రయత్నం చాలా బలంగా చేసారు.

కట్ చేస్తే.. సరిగా మూడేళ్ళకు కాంగ్రెస్ సిఎం, మంత్రులు సచివాలయంలో అడుగు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితే ఇప్పుడు బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ ది కేవలం పరిస్థితి మాత్రమే… కాని బీఆర్ఎస్ ది దుస్థితి. అత్యంత దారుణమైన పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉందనేది చాలా మంది మాట్లాడే మాట. బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ ను ఎదుర్కోవడం కంటే బీఆర్ఎస్ ను ఎదుర్కోవడం పెద్ద సమస్య అయింది. ఉదాహరణకు మూసీ, గ్రూప్ 1, హైడ్రా వ్యవహారాలు తీసుకుంటే… బీఆర్ఎస్ కు వచ్చిన ఇమేజ్ కంటే బిజెపికి వచ్చిన ఇమేజ్ ఎక్కువ.

Also Read : రంగంలోకి సోనియా…. ప్రియాంక గెలుపే లక్ష్యమా?

మూసీ విషయంలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్న సమయంలో గ్రూప్ 1 ఉద్యోగాలతో బిజెపి రంగంలోకి దిగి సంచలనం రేపింది. సీఎస్ శాంత కుమారి ఏకంగా బండి సంజయ్ కు ఫోన్ చేసి సచివాలయానికి వస్తే చర్చలు జరుపుదాం అని హామీ ఇచ్చారు. గ్రూప్ 1 గేమ్ లో మొత్తం బిజెపి మాత్రమే ఉంది. కాని బీఆర్ఎస్ ఎక్కడా లేదు. మూసీపై పోరాటం చేస్తున్న సమయంలో ఏదోక రూపంలో డైవర్ట్ అవుతూనే ఉంది. మొన్న కొండా సురేఖ కామెంట్స్, ఇప్పుడు బండి సంజయ్ పోరాటం. దీనితో బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. తాము ఎత్తుకోవాల్సిన రాగాన్ని బిజెపి ఎత్తుకుని పాట గట్టిగా పాడటంతో కేటిఆర్ కు బిజెపి భయం పట్టుకుంది. మొత్తం మీద బిఆర్ఎస్ ని, ఆ పార్టీ అభిమానులని బిజెపి ఆక్రమించేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్