Saturday, September 13, 2025 03:21 AM
Saturday, September 13, 2025 03:21 AM
roots

సల్మాన్ కు ప్రాణహాని.. అయినా క్షమాపణ ఎందుకు చెప్పడం లేదు..?

బాలీవుడ్ ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ అనే 31 ఏళ్ళ యువకుడి పేరు వింటే వణికిపోతుంది. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్, చోటా షకీల్, రవి పూజారి వంటి గ్యాంగ్ స్టర్ లంటే ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ కే ఎక్కువగా ఉలిక్కిపడుతోంది. ముఖ్యంగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు కంటి మీద కునుకు ఉండటం లేదు. సల్మాన్ ను చంపేస్తా అని 2018 లో తొలిసారి చెప్పిన లారెన్స్ బిష్ణోయ్ వార్నింగ్ ను అప్పట్లో అందరూ లైట్ తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ ను చంపడం అంత ఈజీనా అంటూ చాలా మంది పట్టించుకోలేదు.

కాని సల్మాన్ ఖాన్ కు, అప్పుడు తక్కువ అంచనా వేసిన వాళ్లకు భయం మొదలయింది ఇప్పుడు. ఓ మాజీ మంత్రిని, ప్రస్తుత ఎమ్మెల్యేని ముంబైలోనే కాల్చి చంపి సల్మాన్ కు వార్నింగ్ పంపాడు లారెన్స్ బిష్ణోయ్. కృష్ణ జింకను వేటాడిన విషయంలో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని లారెన్స్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత… ఈ ఏడాది ఏప్రిల్ లో సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపి ఇది ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా ముందు ఉంది అని హెచ్చరించింది లారెన్స్ గ్యాంగ్. 5 రాష్ట్రాల్లో 700 మంది షార్ట్ షూటర్స్ తో లారెన్స్ గ్యాంగ్ చాలా బలమైనది.

Also Read : ఒకేసారి ఆరు సినిమాలు.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్

ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఈ గ్యాంగ్ అడుగు పెట్టింది. దీనితో బాలీవుడ్ స్టార్లకు భయం మొదలయింది. సల్మాన్ తో స్నేహం చేసే వాళ్లకు ఆ భయం ఎక్కువగా ఉంది. సింగర్ గ్రిప్పి గ్రీవాల్ కేవలం తనకు తమ్ముడు అని సల్మాన్ చెప్పిన పాపానికి అతనిపై కూడా కాల్పులకు దిగారు. ఇక ఇప్పుడు అత్యంత సన్నిహితుడు బాబా సిద్దిఖీని చంపారు. అయితే సల్మాన్ క్షమాపణ చెప్తే వదిలేస్తామని లారెన్స్ గ్యాంగ్ హామీ ఇచ్చింది. కాని సల్మాన్ మాత్రం చెప్పడం లేదు. దీని వెనుక సల్మాన్ కు భయం ఉంది. 1998 నుంచి తాను నేరం చేయలేదని వివిధ రకాలుగా సల్మాన్ వాదిస్తూ వచ్చాడు. ఇప్పుడు చంపాను అని చెప్తే నేరం అంగీకరించినట్టు అవుతోంది. అప్పుడు కచ్చితంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతన్ని అరెస్ట్ చేస్తారు. అభిమానుల్లో కూడా సల్మాన్ చులకన అవుతాడు. దీనితో ఎటూ కాకుండా ఉంది సల్మాన్ పరిస్థితి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్