Friday, September 12, 2025 10:56 PM
Friday, September 12, 2025 10:56 PM
roots

మందు గోల… రంగంలోకి పెద్దాయన…!

మద్యం మాఫియా… గత ఐదేళ్ల వైసీపీ సర్కార్‌లో ఇదే మాట పెద్ద ఎత్తున వినిపించింది. ఇంకా చెప్పాలంటే అధికార పార్టీపై ప్రతి రోజు విమర్శలు చేశారు ప్రతిపక్ష నేతలు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించడం వల్ల ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజనాకే వస్తుందని వైసీపీ సర్కార్ చెప్పుకొచ్చింది. అయితే ఎక్కడా యూపీఐ చెల్లింపులు లేకపోవడం… కేవలం నగదు బదిలీ వల్లే అమ్మకాలు చేయడం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు నాసిరకం బ్రాండ్‌లతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారనే అపవాదు కూడా వైసీపీ సర్కార్ మూటగట్టుకుంది. బ్రాండెడ్ మద్యం కోసం మందుబాబులు ఇతర రాష్ట్రాలకు క్యూ కట్టారు కూడా. విచిత్రమైన పేర్లతో నాసిరకం మద్యం అంటగట్టింది వైసీపీ సర్కార్. దీంతో మందు బాబులు సైతం జగన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన మద్యం పాలసీపై చంద్రబాబు సర్కార్ కసరత్తు చేసింది. అక్టోబర్ నుంచి ప్రైవేటు మద్యం షాపులకు అనుమతి మంజూరు చేసింది. అలాగే ఏపీ వ్యాప్తంగా 3,396 షాపులకు ఆన్ లైన్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. ఇక అంతే… తన మన అనే బేధం లేకుండా నేతలు రంగంలోకి దిగారు. ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారానికి దూరంగా ఉన్న నేతలంతా ఇప్పుడు జూలు విదిలించారు. అప్లికేషన్ దాఖలుకు కూడా తమ అనుమతి తీసుకోవాల్సిందే అని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హుకుం కూడా జారీ చేశారు. కొన్ని చోట్ల అయితే రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి టీడీపీ, వైసీపీ నేతలు చెట్టాపట్టాలేసుకుని మరి మద్యం టెండర్లు దాఖలు చేశారు. ఈ విషయం బయటకు తెలియటంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో కొందరు నేతలు వెనక్కి తగ్గారు.

Also Read :జగన్ కు మరో ముగ్గురు ఎమ్మెల్సీల షాక్

ఇక లాటరీలో షాపుల కేటాయింపు పూరైన తర్వాత అసలు సినిమాకు తెరలేపారు కొందరు ప్రజాప్రతినిధులు. షాపు దక్కించుకున్న వారిని నేరుగా బెదిరించారు. కొన్ని చోట్ల దాడులు కూడా చేశారు. షాపు ఎలా నడుపుతావో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మాకు ఇచ్చేసి… మేము ఇచ్చింది తీసుకుని పో అంటూ భయపెట్టారు. పైకి పారదర్శకంగానే షాపుల కేటాయింపు జరిగినప్పటికీ… తెర వెనుక మాత్రం వ్యాపారం కోసం వచ్చిన వారికి బెదిరింపులు ఎదురయ్యాయి. చివరికి డీడీలు తీసిన తర్వాత కూడా కొందరు వ్యాపారులు బెదిరింపులకు భయపడి రాజీ చేసుకునేందుకు నేరుగా ప్రజాప్రతినిధితోనే సమావేశమయ్యారు.

ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో… స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ నెల 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇసుక, మద్యం వ్యవహారాల్లో వస్తున్న ఆరోపణలపైనే చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన ఇసుక, మద్యం వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో పార్టీ ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు. ఏ విషయంపై అధినేతతో మాట పడాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్