వైసీపీకి ఎట్టకేలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసారు. దాదాపు ఏడాది నుంచి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో కూడా బాలినేని అధిష్టానం వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రకాశం జిల్లాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల ఆయన 20 మంది కార్పొరేటర్లతో కలిసి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్ళారు.
బాలినేని అండతో గెలిచిన కార్పొరేటర్ లు బాలినేని వెంట వెళ్ళడంతో అధిష్టానం అలెర్ట్ అయింది. ఒంగోలు మునిసిపల్ కార్పోరేషన్ ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి విడదల రజనీ తో రాయబారం పంపినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కాని బాలినేని మాత్రం అధిష్టానం విషయంలో వెనక్కు తగ్గలేదు. పైగా ఈవీఏం ల విషయంలో జగన్ ఆరోపణలు చేయమంటేనే తాను చేశా అని బాంబు పేల్చారు. ఇక పార్టీ ఓటమికి జగన్ మూర్కత్వమే కారణం అంటూ ఆయన ఆరోపణలు చేసారు. ఓడిపోతాం అని జగన్ కు చెప్పినా వినలేదని నిఘా నివేదికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా జగన్ వినలేదని బాలినేని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read Also : వివేకా కేసు విషయంలో జగన్ చేసిన పెద్ద తప్పు ఇదే
ఇక తన రాజీనామా లేఖను బాలినేని పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పంపారు. ఈవీఎం ల విషయంలో తనను ఇరికించారని విడదల రజనీ తనను కలవడానికి వెళ్ళిన సమయంలో ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఇక మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వైఖరిపై కూడా బాలినేని సీరియస్ గా ఉన్నారు. ఆయనతో పాటుగా వైవీ సుబ్బారెడ్డి వైఖరిపై కూడా బాలినేని అసహనంగా ఉన్నారు. జిల్లాలో తాను కష్టపడి పార్టీని బలోపేతం చేస్తే ఫలాలు మాత్రం వైవీ అనుభవించారని తనను రాజకీయంగా తొక్కడానికి చూసారని సన్నిహితుల వద్ద బాలినేని వాపోయారు. త్వరలోనే జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.