జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా విషయంలో నెగటివ్ ప్రచారం ఆ సినిమా యూనిట్ ని కంగారు పెడుతోంది. సినిమా ట్రైలర్ విడుదలైన దగ్గరి నుంచి సినిమాకు నెగటివ్ ప్రచారం కంగారు పెడుతున్న అంశం. ఇప్పుడు సినిమాకు అన్ని వైపుల నుంచి సమస్యలు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. సినిమా యూనిట్ ఎంత భారీగా ప్రమోషన్ చేస్తున్నా.. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ మాత్రం ఫ్యాన్స్ కి, సినీ యూనిట్ కి బీపీ పెంచుతున్నాయనే చెప్పాలి.
అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ కు ఉన్న స్నేహం ఈ సినిమాకు ఒక సమస్య కాగా, దర్శకుడు కొరటాల శివ అవ్వడం మరో సమస్య అయింది. కొరటాల శివ… ఆచార్య సినిమా విషయంలో చిరంజీవి వైపు వేలెత్తి చూపించారని.. సినిమా ఫ్లాప్ కావడానికి చిరంజీవి డైరెక్షన్ చేసారనే విషయాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళారని మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు. అందుకే ఇప్పుడు ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఆచార్య సినిమా కాపీ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు మెగా అభిమానులు. ఆ తర్వాత మరిన్ని విధాలుగా సినిమాను టార్గెట్ చేస్తున్నారు.
సినిమాలో పాటలు, యాక్షన్ సీన్స్ అన్ని ఇతర సినిమాల నుంచి కాపీ చేశారు అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ చేస్తారనే ప్రచారం జరిగిన దగ్గరి నుంచి మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దేవర సినిమాని టార్గెట్ చేస్తున్నారు. దానికి తోడు హీరోయిన్ అంతగా సెట్ కాలేదు అన్న మరో నెగటివ్ వ్యాఖ్యలు సినీ ప్రరిశ్రమలో వినిపిస్తున్నాయి. అది కూడా ఈ సినిమాకు పెద్ద సమస్యే అయింది. సినిమా విడుదల సమయానికి రికార్డుల గురించి మాట్లాడాల్సింది పోయి నెగటివ్ ప్రచారం తగ్గించుకోవడం మీదనే చిత్ర యూనిట్ దృష్టి పెట్టడం తలనొప్పిగా మారిన అంశం.