Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

మెగా కుటుంబంలో ముదురుతున్న వివాదం.. అలెర్ట్ అయినా అల్లు

2024 ఏపీ ఎన్నికలు ఒకే కుటుంబంలో ఉన్న రాజకీయ శత్రుత్వాన్ని బయటపెడితే, మరో రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరాన్ని సృష్టించాయి. ఇక మొన్నటి దాకా మెగా కాంపౌండ్ గా ఉన్న కుటుంబం ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుంది అనే దానిపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ కావాలనే ఇబ్బంది పెడుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. జనసేన పోటీ చేస్తుంటే వెళ్లి వైసీపీకి ఎవడు సపోర్ట్ చేయమన్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ఈ వివాదం చినికి చినికి గాలి వాన అవుతోంది.

అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా విడుదల అయితే తనను ఇబ్బంది పెడతారనే భావనలో అల్లు అర్జున్ ఉన్నాడని టాక్ నడుస్తోంది. పుష్ప 2 సినిమాను ఆలస్యం చేయడం వెనుక ప్రధాన కారణం అదే అని, అందుకే షూట్ ఆలస్యం అవుతోందని అంటున్నారు. రిలీజ్ అయ్యే లోపు తన ఫ్యాన్స్ ని సింపతీ ద్వారా పెంచుకోవాలని బన్నీ చూస్తున్నాడు. మెగా ఫ్యామిలీ అందరిని తొక్కేస్తుంది అని, ఇప్పుడు తమకు ఎదురు తిరిగిన అల్లు అర్జున్ ని కూడా తొక్కాలని చూస్తుందని అల్లు ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఈ వివాదం ఎవరిని ఎలా ఇబ్బంది పెడుతుందో అర్ధం కావడానికి కొంత సమయం పెట్టొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి మెగా ఫాన్స్ గా ఉన్న అభిమానులు ఇప్పుడు మెగా ఫాన్స్ Vs అల్లు ఫాన్స్ గా చీలిపోయారు.

అసలే ఎన్నికలప్పటి నుంచి కోపంగా ఉన్న మెగా ఫ్యాన్స్… అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల అయితే ఇబ్బంది పెట్టాలని పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. అది గ్రహించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఫ్యాన్స్ ని అలెర్ట్ చేసాడు. ఇక సామాన్య ప్రజల్లో కూడా అల్లు అర్జున్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారనే సిగ్నల్స్ వెళ్ళాయి. అటు వైసీపీ అభిమానులు కూడా బన్నీ విషయంలో సానుభూతితోనే ఉన్నారు. రేపు పుష్ప 2 రిలీజ్ అయినా మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేసినా సరే… ఇబ్బంది ఉండదు వీళ్ళు అందరూ మద్దతు ఇస్తే. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతోంది. డిసెంబర్ లో రామ్ చరణ్ హీరో గా వచ్చే గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఉంది. మరి దానిపై అల్లు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్