Friday, September 12, 2025 11:40 PM
Friday, September 12, 2025 11:40 PM
roots

ఓటుకి నోటు కేసులో చంద్రబాబుకి బిగ్ రిలీఫ్

ఓటుకి నోటు కేసు విషయంలో టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టె విధంగా వైసీపీ అడుగులు వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి జగన్ విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ఈ వ్యవహారంలో చంద్రబాబు పేరు లేకపోవడం వారిని విస్మయానికి గురి చేసింది. చంద్రబాబుని ఇరికించేందుకు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేసినా సరే అవి అంతగా ఫలించలేదు అనే చెప్పాలి. ఇక ఈ అంశంలో చంద్రబాబు ని ఇబ్బంది పెట్టే విధంగా సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్ళారు వైసీపీ నేతలు. వైసీపీ తరుపున వేసిన కేసుల్లో అత్యధిక భాగం వైసీపీ నాయకుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసినవే ఎక్కువ.

Chandrababu Naidu With Revanth Reddy

ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట వీరయ్య సహా పలువురు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు పాత్ర కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేసినా, కొన్ని ఫోన్ రికార్డులు బయటపెట్టినా సరే ఈ కేసులో ఆయన పేరుని చేర్చలేదు. ఇదిలా ఉంచితే ఇప్పుడు ఈ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకి నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో వైసిపి నేత ఆళ్ల రామకృష్ణ రెడ్డికి చుక్కెదురు అయింది. చంద్రబాబుని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా సుప్రీం తలుపు తట్టిన ఆళ్ళ రామకృష్ణ కి షాక్ ఇచ్చే విధంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి భారీ ఊరట లభించింది.

High Court On Chandrababu Naidu

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సిబిఐ అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష్య సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషన్ రామకృష్ణ రెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పిటిషన్ కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రింకోర్టు సమర్ధించింది. దీంతో ఇన్నాళ్లూ ఈ కేసు విషయంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నాయకుల నోళ్లు ఇప్పటికైనా మూతపడతాయేమో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్