ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీసులో ఐపిఎస్ లు ఎందుకు కంగారు పడుతున్నారు…? క్యాంప్ ఆఫీసులో, సచివాలయంలో పని చేసే ఐఏఎస్ లు ఎందుకు ఎవరితో అయినా మాట్లాడాలంటే భయపడుతున్నారు…? ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరైనా కలుస్తామంటే ఎందుకు వద్దు అంటున్నారు…? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం… ఇటీవల 16 మంది ఐపిఎస్ ల విషయంలో జారీ అయిన జీవోనే. ఆ జీవో దెబ్బకు ఒక్కొక్కరికి చుక్కలు కనపడుతున్నాయి. తప్పు చేసినా లెక్కలేనితనంగా వ్యవహరించిన ఆ కొందరు అధికారులకి ఇప్పుడు అధికార
నిన్న మొన్నటి వరకు స్వేచ్చగా తిరిగిన ఐపిఎస్ లు ఇప్పుడు ప్రభుత్వ పెద్దల నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే మాత్రం వాటిని పక్కాగా అమలు చేసేందుకు సిద్దమైపోతున్నారు. ఏదైనా అంశం విషయంలో విచారణ చేయాలంటే దాన్ని నిజాయితీగా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన అధికారులుగా గుర్తింపు పొందిన 16 మంది ఐపిఎస్ లకు పోస్టింగ్ వచ్చే సూచనలు ఏ కోణంలో కూడా కనపడటం లేదు. రేపు పొరపాటున డీజీపీ ఆఫీసుకు రిపోర్ట్ చేయమని చెప్పినా, సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని చెప్పినా సరే మా పరిస్థితి కూడా అంతే అనే భావనలో చాలా మంది ఐపిఎస్ లు ఉన్నారు.
త్వరలో మరికొంత మంది ఐపిఎస్ ల పరిస్థితి అదే కానుంది. కీలక శాఖల్లో పని చేస్తున్న ఐఏఎస్ ల మీద కూడా పూర్తి నిఘా ఉంది. నిఘా విభాగం… చాలా అంశాలను అత్యంత కీలకంగా గమనిస్తూ వస్తోంది. అందుకే 16 మంది ఐపిఎస్ ల గురించి ఆ ఆదేశాలు వచ్చాయి. నిప్పుతో అయినా తల గోక్కోవచ్చు గాని రాజకీయ నాయకులతో కెలుక్కోవద్దు అనే విషయంలో క్లియర్ కట్ గా అర్ధమైంది మొన్నటి దెబ్బతో. అందుకే సమాచారం చేరవేసే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినట్టు సమాచారం.
కొందరు కీలక అధికారుల మీద నిఘా ఉంది అనే సంకేతాలు కూడా వెళ్ళాయి. అందుకే చాలా మంది క్వార్టర్స్ ధాటి బయటకు వెళ్ళే ప్రయత్నం కూడా చేయడం లేదు. పోస్టింగ్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఆ దెబ్బతో సెట్ అయిపోయారు. అందుకే సచివాలయంలో, డీజీపీ ఆఫీస్ లో అధికారులకు చెమట పడుతుంది అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. వారి మీద మీడియా నిఘా కూడా ఉందని కూడా తెలియడంతో ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా కూడా కంగారు పడిపోతున్నారు.