తెలంగాణాలో ఇప్పుడు డ్రగ్స్ అనే మాట వినపడినా సరే జనాలు భయపడుతున్నారు. తెలంగాణాను డ్రగ్స్ నుంచి విముక్తి చేసే లక్ష్యంతో అడుగులు వేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చేసారు. మీరు ఏం చేస్తారో తెలియదు, తెలంగాణాలో డ్రగ్స్ గాని.. గంజాయి గాని వినపడకూడదు కనపడకూడదు, అవసరమైతే ఏ నిర్ణయం అయినా తీసుకోండి అంటూ వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు. ఇక సిఎం నుంచి ఆ రేంజ్ లో సపోర్ట్ ఉండటంతో అధికారులు ఇప్పుడు స్పీడ్ పెంచేశారు.
రెండు రోజుల్లో నలుగురిని డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ చేసి దాదాపు 4 కోట్ల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారంటే ఏ స్థాయిలో డ్రగ్స్ పై వేట కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మన్యం ప్రాంతాల్లో ఇప్పుడు గంజాయి మీద కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అవసరమైతే చెక్ పోస్ట్ లు పెంచడం మీద కూడా ఆయన దృష్టి పెడుతున్నారు. మారుమూల గ్రామాల్లో కూడా గంజాయి రవాణా జరగకుండా పోలీసుల్లోనే ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా తయారు చేయడానికి ఆయన సిద్దమవుతున్నారు.
గంజాయి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. దీనితో అక్కడ గట్టి దృష్టి పెడుతున్నారు. డ్రగ్స్ విషయంలో అయితే కూకటి వేళ్ళతో సహా పెకలించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమైంది. ఎవరిని అయినా అదుపులోకి తీసుకుంటే వారిని పైపైన విచారించి వదలడం లేదు. వారి మూలాలను కూడా ఆరా తీస్తున్నారు పూర్తి స్థాయిలో. వారి ఇళ్ళను సోదాలు చేయడమే కాకుండా… వారి కుటుంబ సభ్యుల ఇళ్ళ మీద, స్నేహితుల మీద కూడా గురి పెడుతున్నారు. అలానే నిన్న ఏకంగా 2 కోట్ల విలువైన డ్రగ్స్ ని హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఇప్పుడు డ్రగ్స్ అనే మాట కూడా మాట్లాడటానికి భయపడేలా పరిస్థితి ఉంది.




