Monday, October 27, 2025 10:29 PM
Monday, October 27, 2025 10:29 PM
roots

విజయమ్మతో జేసీ కీలక భేటీ.. ట్విస్ట్ ఏంటంటే?

రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగోచ్చు. శత్రువులే మిత్రులు, మిత్రులే శత్రువులు కూడా మారే అవకాశం కేవలం రాజకీయాల్లో మాత్రమే సాధ్యం. రాజకీయాల్లో వీళ్ళు శత్రువులు, వీళ్ళు మంచి మిత్రులు అని చెప్పుకోవడం హాస్యాస్పదం అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఈ మధ్య ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న నాయకులు కూడా ఒకే వేదిక పైకి రావడం, ఒకే పార్టీ తరుపున పని చేయడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు దాడులు, ప్రతిదాడులు చేసుకున్న నాయకులే ఇప్పుడు… స్నేహ హస్తం అందించుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో జెసి కుటుంబం గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. ఇప్పుడు వచ్చిన వార్తా కూడా అదే కుటుంబం నుంచే.

కాంగ్రెస్ లోనే ఉన్నా జేసి కుటుంబానికి వైఎస్ కుటుంబానికి పచ్చ గడ్డ వేస్తే కాదు ఒకరి నీడ ఒకరి మీద పడినా భగ్గుమనే వాతావరణం. జేసి కుటుంబ ఆధిపత్యం ఎక్కువ కావడం కాంగ్రెస్ లోనే ఉన్న వైఎస్ కుటుంబానికి నచ్చేది కాదు. వైఎస్ రాజా రెడ్డి, జేసి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడిచేది. అప్పట్లో పంట పొలాలు కూడా నాశనం చేసుకున్న సంఘటనలు ఎన్నో రాష్ట్ర ప్రజలు చూశారు. ఇక పరిటాల కుటుంబానికి, జేసి కుటుంబానికి మధ్య కూడా అలాంటి వాతావరణమే ఉండేది. వీరి పోరులో పెద్ద ఎత్తున ప్రజలు, అనుచరులు ప్రాణాలు కోల్పోయారు.

అలాంటి పోరు నుంచి ఇప్పుడు జేసి, పరిటాల కుటుంబాలు జిల్లాలో కలిసి పని చేస్తున్నాయి. ఇదే సమయంలో వైఎస్ కుటుంబానికి, జేసి కుటుంబానికి దూరం మరింత పెరిగింది. జేసి ప్రభాకర్ రెడ్డి ని అనేక విధాలుగా వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు వేధించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో కడప జిల్లాలో కాస్త ఏదో తెలియని అలజడి అయితే కనపడుతుంది. తాడిపత్రి, పులివెందుల నియోజకవర్గాలు సరిహద్దు నియోజకవర్గాలే. ఆ అలజడి మధ్యలో వైఎస్ విజయమ్మ వెళ్లి జేసి ప్రభాకర్ రెడ్డి తో సమావేశం అయ్యారు. ఈ పరిణామం చూసిన రెండు కుటుంబాల చరిత్ర తెలిసిన వారు ఖంగుతిన్నారు.

జగనే రాజీ కోసం విజయమ్మని పంపించారా లేక విజయమ్మ మరేదైనా కారణంతో వెళ్లి కలిసారా…? షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం జెసి ప్రభాకర్ రెడ్డిని విజయమ్మ ఏమైనా కలిసారా అనేది ఇప్పుడు అసలు అర్ధం కాని వ్యవహారంలా ఉంది అందరికి. అప్పట్లో వైఎస్ మంత్రి వర్గంలో జేసి దివాకర్ రెడ్డి ఉన్నా సరే ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది కాదని అంటూ ఉండేవారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ఇదో సంచలనమే అని చెప్పుకోవాలి. పైకి మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నప్పటికీ రాజకీయ అంశాలు తప్పక చర్చకి వచ్చి ఉంటాయని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్