Sunday, November 29, 2026 06:59 AM
Sunday, November 29, 2026 06:59 AM

ట్రిప్ ప్లానింగ్ ఇక మరింత ఈజీ.. గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..!

పర్యటనలకు వెళ్లాలని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్లాలి, ఏ సమయంలో ఏ ప్రదేశాన్ని చూడాలి, బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాల్లో చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ గూగుల్ సంస్థ తన ‘ఆస్క్ మ్యాప్స్’ ఫీచర్‌లో సరికొత్త ఏఐ ట్రిప్-ప్లానింగ్ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక రోజు చిన్నపాటి విహారయాత్ర అయినా, లేదా సుదీర్ఘ సెలవుల పర్యటన అయినా సరే.. ఈ కొత్త ఫీచర్ ద్వారా స్టెప్-బై-స్టెప్ పూర్తి ప్రయాణ ప్రణాళికను చిటికెలో సిద్ధం చేసుకోవచ్చు.

Also Read : ఢిల్లీ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్.. ఎంపీలకు కీలక ఆదేశాలు..!

ఈ అప్‌డేట్ ద్వారా వినియోగదారులు రోజువారీ టూర్ షెడ్యూల్‌తో పాటు మ్యాప్‌లో నంబర్ల వారీగా లొకేషన్ పిన్స్‌ను పొందవచ్చు. ప్రయాణ మార్గంలో ట్రాఫిక్ పరిస్థితులు, దుకాణాలు లేదా రెస్టారెంట్ల పనివేళలు, వాతావరణ వివరాలు, టోల్ గేట్లు, వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలి వంటి రియల్-టైమ్ సమాచారాన్ని ఇది ఎప్పటికప్పుడు అందిస్తుంది. అంతేకాకుండా, ప్రయాణ మధ్యలో భోజనానికి ఎక్కడ ఆగాలని అడిగినా వెంటనే షెడ్యూల్‌ను మార్చి ఇస్తుంది. ఈ ప్లాన్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడంతో పాటు..

Also Read : రిషికొండ ప్యాలెస్‌ పై ఏపీ కేబినెట్‌ సంచలన నిర్ణయం.. జగన్‌కి మైండ్‌ బ్లాంక్‌

గూగుల్ డాక్స్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కేవలం ప్రయాణాలకే పరిమితం కాకుండా, బ్యూటీ సెలూన్లు, పెట్ కేర్, ఆటో రిపేర్, హోమ్ రిపేర్ వంటి సేవల కోసం సమీపంలోని దుకాణాల్లో ఖాళీ స్లాట్లను చూసి ఆన్‌లైన్‌లోనే అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఇందులో చేర్చారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న ఈ ట్రిప్-ప్లానింగ్ ఫీచర్ 200కు పైగా దేశాల్లో విస్తరిస్తుండగా, అపాయింట్‌మెంట్ బుకింగ్, నో బిఫోర్ యూ గో వంటి ప్రత్యేక టిప్స్‌ను తొలుత అమెరికాలో ప్రారంభించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

హరీష్ దెబ్బ మామూలుగా...

హైదరాబాద్‌లో ఎకరం భూమి ధర వంద...

రిషికొండ ప్యాలెస్‌ పై...

విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల...

ఢిల్లీ రాజకీయాలపై చంద్రబాబు...

కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు రంగం...

ఇంద్రకీలాద్రిపై ఆగని ఇంటిదొంగల...

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుస...

టీడీపీ ఎమ్మెల్యే ఆడియో...

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే...

ముంబై బాస్‌ మళ్లీ...

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు మరోసారి...

పోల్స్