Sunday, November 29, 2026 06:59 AM
Sunday, November 29, 2026 06:59 AM

హరీష్ దెబ్బ మామూలుగా లేదుగా..!

హైదరాబాద్‌లో ఎకరం భూమి ధర వంద కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది. ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే అవకాశం ఉన్న భూములు.. వేలం వేదికపై మాత్రం కొనుగోలుదారుల కోసం ఎదురుచూశాయి. కనీసం ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. న్యాయపరమైన అడ్డంకులు తొలగించుకుని ముందుకెళ్లిన హెచ్ఎండీఏకు చివరకు మార్కెట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు మూసాపేట ట్రక్ పార్క్ భూముల విక్రయాన్ని అడ్డుకునేందుకు హరీశ్ రావు నేతృత్వంలో సాగిన రాజకీయ పోరాటం కూడా ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం తెచ్చింది. కోట్ల విలువైన భూముల వేలం విఫలమవడం వెనుక మార్కెట్ పరిస్థితులున్నాయా.. లేక రాజకీయ ఒత్తిడి పనిచేసిందా, లేక ప్రభుత్వ ధరల నిర్ణయంలోనే లోపముందా అనే అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

Also Read : కేంద్రానికి షాక్ ఇచ్చిన డీఎంకే.. చంద్రబాబు రాయబారం ఫలిస్తుందా..?

నిధుల సమీకరణలో భాగంగా మూసాపేట, కోకాపేట భూములను వేలానికి హెచ్ఎండీఏ సిద్ధం చేసింది. మూసాపేట ట్రక్ పార్క్ లేఅవుట్లో 3.15 ఎకరాలకు ఎకరా కనీస ధర 99 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. కోకాపేట నియోపొలిస్ల్‌లో 4.59 ఎకరాలకు ఎకరా 120 కోట్ల రూపాయల ధర ఖరారు చేసింది. ఈ రెండు భూముల ద్వారా కనీసం 862 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసింది. కానీ వేలం నిర్వహించినప్పుడు ఒక్క బిడ్డర్ కూడా ముందుకు రాలేదు. అంతకుముందు బంజారాహిల్స్‌లోని హుడా పార్క్ లేఅవుట్ ప్లాట్ల వేలానికి కూడా స్పందన రాకపోవడం ప్రభుత్వ భూముల విక్రయ వ్యూహంపై సందేహాలు పెంచింది.

Also Read : టీడీపీ ఎమ్మెల్యే ఆడియో లీక్‌.. ఎందుకు ఈ నోటి దూల..?

భారీ ధరలు నిర్ణయించడం, పెట్టుబడిదారుల ఆర్థిక పరిస్థితులు, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న అనిశ్చితి ఈ వైఫల్యానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. మూసాపేట ట్రక్ పార్క్ భూముల వ్యవహారం కేవలం రియల్ ఎస్టేట్ లావాదేవీ కాదు. దశాబ్దాల క్రితం భారీ వాహనాల పార్కింగ్ అవసరాల కోసం సేకరించిన ఈ భూములు ఇప్పుడు నగరంలోని విలువైన వాణిజ్య ప్రాంతంలో ఉన్నాయి. ట్రక్ పార్కింగ్‌తో పాటు నర్సరీ, ఆర్టీఏ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వంటి ప్రజా అవసరాలకు ఉపయోగపడుతున్నాయనేది ప్రతిపక్షాల మాట. 2013లో కూడా ఇదే భూముల విక్రయ ప్రతిపాదనపై అప్పటి టీఆర్ఎస్, వామపక్షాలు నిరసనలు తెలిపాయి. ఇప్పుడు మళ్లీ వేలం ప్రతిపాదన రావడంతో పాత ఉద్యమం కొత్త రూపంలో ప్రారంభమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలతో కలిసి భూములను పరిశీలించిన హరీశ్ రావు లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులతో మాట్లాడారు.

Also Read : ఇంద్రకీలాద్రిపై ఆగని ఇంటిదొంగల దందా..!

భూముల విక్రయం వారి జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని పేర్కొంటూ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ పోరాటాన్ని ఒక్క పార్టీకి పరిమితం చేయకుండా హరీశ్ రావు అఖిలపక్షాల సహకారంతో ముందుకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు, కార్మిక సంఘాలు కలిసి నిరసనలు చేపట్టాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూములను తిరిగి ప్రజా అవసరాలకు వినియోగిస్తామని వేలంలో పాల్గొనే పెట్టుబడిదారులను కూడా హరీశ్ రావు హెచ్చరించారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు న్యాయపోరాటం చేపట్టారు. అయితే హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా పరిణామాలు చోటుచేసుకోవడంతో వేలానికి మార్గం సుగమమైంది. అయినప్పటికీ వేలంలో బిడ్లు రాకపోవడం ప్రతిపక్షాలకు రాజకీయంగా అనుకూల పరిణామంగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రిషికొండ ప్యాలెస్‌ పై...

విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల...

ఢిల్లీ రాజకీయాలపై చంద్రబాబు...

కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు రంగం...

ఇంద్రకీలాద్రిపై ఆగని ఇంటిదొంగల...

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుస...

టీడీపీ ఎమ్మెల్యే ఆడియో...

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే...

ముంబై బాస్‌ మళ్లీ...

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు మరోసారి...

కేంద్రానికి షాక్ ఇచ్చిన...

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డీఏ...

పోల్స్