న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తొలి టెస్టులో సిరాజ్ లేకపోవడం వల్లే భారత్ విజయం సాధించలేకపోయిందని మాజీలు, అభిమానులు అభిప్రాయపడుతున్న వేళ, రెండో టెస్టులోనూ అతడిని బెంచ్‌కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంతో, గత ఏడేళ్లుగా భారత్ ఆడిన ప్రతి విదేశీ టెస్టు సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడుతూ వచ్చిన సిరాజ్ అరుదైన రికార్డుకు బ్రేక్ పడింది.
Also Read : టీడీపీ ఎమ్మెల్యే ఆడియో లీక్.. ఎందుకు ఈ నోటి దూల..?
ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. జట్టు యాజమాన్యం కాకుండా బయట ఉన్న ప్రతి ఒక్కరూ సిరాజ్ తుది జట్టులో ఉండాల్సిందేనని నమ్ముతున్నారని, అయితే ఎన్ని విమర్శలు, ఒత్తిళ్లు ఎదురైనా తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. అందరూ వ్యతిరేకిస్తున్న సమయంలోనూ వెనక్కి తగ్గకుండా తమ ఆలోచనపై నమ్మకంతో నిలబడే ధైర్యం అందరికీ ఉండదని జాఫర్ ప్రశంసించారు.
Also Read : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై టీటీడీ కీలక ప్రకటన..!
మరోవైపు, క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మొదటి రోజు వికెట్ తీయలేకపోయినా, ఆకాశ్ దీప్, అరంగేట్ర పేసర్ గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్, వాషింగ్టన్ సుందర్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 111 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ అత్యంత కీలకంగా మారింది.


