Saturday, November 21, 2026 02:03 PM
Saturday, November 21, 2026 02:03 PM

నాడు వైఎస్సార్ ఆహ్వానిస్తే షర్మిల పెళ్లికి కూడా వెళ్లా: సీఎం చంద్రబాబు

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడంపై వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతంపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తె పెళ్లికి రావాలని షర్మిల స్వయంగా వచ్చి శుభలేఖ ఇస్తే, దానిని కూడా రాజకీయం చేస్తూ వైసీపీ నేతలు వివాదం సృష్టించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.

Also Read : ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.. జెడ్పీ ఛైర్‌పర్సన్.. ఏపీలో నాలుగు కుటుంబాల అరుదైన రికార్డు..!

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. “నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, నేను రాజకీయంగా తీవ్ర స్థాయిలో పోరాటం చేశాం. కానీ మా మధ్య ఎప్పుడూ మానవ సంబంధాలు, వ్యక్తిగత గౌరవం ఉండేవి. ఆనాడు వైఎస్సార్ నన్ను ఆహ్వానిస్తే నేను స్వయంగా వైఎస్ షర్మిల వివాహానికి కూడా వెళ్లాను. అయితే జగన్ పెళ్లికి వెళ్లినట్లు నాకు గుర్తులేదు” అని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : ఓటమిని జీర్ణించుకోలేక బొత్స వాగుతున్నారు.. చిన్న శ్రీను స్ట్రాంగ్ కౌంటర్..!

రాజకీయ విభేదాలు కేవలం ఎన్నికలు, విధానాల వరకే పరిమితం కావాలి తప్ప, కుటుంబ శుభకార్యాలు, వ్యక్తిగత సంబంధాలను కలుషితం చేయకూడదని చంద్రబాబు హితవు పలికారు. కానీ నేడు వైసీపీ నాయకులు ప్రతిపక్షం పేరుతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, కనీస సంస్కారం, మానవ విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నవంబర్ 25న బెంగళూరులో జరగనున్న షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహానికి తనను ఆహ్వానించడం ఒక సామాజిక సంప్రదాయమని, దానిని కూడా తప్పుబట్టడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఓటమిని జీర్ణించుకోలేక బొత్స...

విజయనగరం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి...

స్టాక్ మార్కెట్లోకి APMDC.....

ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సరికొత్త చరిత్ర...

చంద్రబాబు, లోకేష్‌తో భేటీ...

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం...

ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.....

ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు...

ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల...

IndiaStat, Projects Today గణాంకాల ప్రకారం,...

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

పోల్స్