Saturday, November 21, 2026 12:38 PM
Saturday, November 21, 2026 12:38 PM

ఓటమిని జీర్ణించుకోలేక బొత్స వాగుతున్నారు.. చిన్న శ్రీను స్ట్రాంగ్ కౌంటర్..!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు, జడ్పీ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. విజయనగరం జిల్లా పరిషత్ పీఠాన్ని చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్ర దక్కించుకున్న నేపథ్యంలో బొత్స చేసిన విమర్శలపై చిన్న శ్రీను తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర ఓటమిని జీర్ణించుకోలేకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై బొత్స ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read : స్టాక్ మార్కెట్లోకి APMDC.. చంద్రబాబు మెగా ప్లాన్!

జిల్లాలో ఎన్నికలన్నీ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరిగాయని చిన్న శ్రీను స్పష్టం చేశారు. ఇప్పుడు బీసీల పట్ల కపట ప్రేమ వలకబోస్తున్న బొత్స సత్యనారాయణ, గతంలో నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. అంతేకాకుండా బొబ్బిలి మున్సిపాలిటీలోనూ బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోయారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలను పూర్తిగా విస్మరించి, ఇప్పుడు పదవులు పోయాక బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అసలు వెనకబడిన వర్గాల పట్ల మీకు ఏం ప్రేమ ఉందో చెప్పాలని ఎద్దేవా చేశారు.

Also Read : ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.. జెడ్పీ ఛైర్‌పర్సన్.. ఏపీలో నాలుగు కుటుంబాల అరుదైన రికార్డు..!

బొత్స సత్యనారాయణకు రాజ్యాంగబద్ధమైన చట్టాలపై గానీ, న్యాయస్థానాల తీర్పులపై గానీ ఏమాత్రం గౌరవం లేదని చిన్న శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల ధ్రువీకరణ పత్రం విషయంలో కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం తగదని హితవు పలికారు. బీసీల అభ్యున్నతి కోసం, వారి రాజకీయ సాధికారత కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని గుండె మీద చేయి వేసుకుని గర్వంగా చెబుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని, ఇకనైనా బొత్స నిరాధార ఆరోపణలు మానుకుని ప్రజా తీర్పును గౌరవించాలని చిన్న శ్రీను స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

స్టాక్ మార్కెట్లోకి APMDC.....

ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సరికొత్త చరిత్ర...

చంద్రబాబు, లోకేష్‌తో భేటీ...

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం...

ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.....

ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు...

ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల...

IndiaStat, Projects Today గణాంకాల ప్రకారం,...

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

కాలుష్యానికి కారకులెవరు..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా...

పోల్స్