Saturday, November 21, 2026 02:09 PM
Saturday, November 21, 2026 02:09 PM

టాలీవుడ్‌లో మరోసారి పైరసీ కలకలం.. రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 4 సినిమాలు..!

తెలుగు చిత్ర పరిశ్రమను పైరసీ భూతం మరోసారి వణికిస్తోంది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ వెబ్‌సైట్‌లలో ప్రత్యక్షమవడం టాలీవుడ్ నిర్మాతలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో పాటు, ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం’ వంటి నాలుగు తెలుగు సినిమాలు ఒకే వెబ్‌సైట్‌లో అక్రమంగా అప్‌లోడ్ అయినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుర్తించింది.

Also read : ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల అసూయ ఎందుకు?

పైరసీ కాపీలపై క్యూబ్ సినిమా టెక్నాలజీస్ నిర్వహించిన ఫోరెన్సిక్ విశ్లేషణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాలను ఏపీలోని కర్నూలు నగరంలో ఉన్న సిటీ స్క్వేర్ మాల్ సినిమా థియేటర్ ప్రాంగణంలో క్యాం కాడర్ ద్వారా రహస్యంగా చిత్రీకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు నిర్ధారణ అయింది. అలాగే నవంబర్ 20న విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కూడా విడుదలైన రోజే ఆ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం కావడంపై..

Also read : ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.. జెడ్పీ ఛైర్‌పర్సన్.. ఏపీలో నాలుగు కుటుంబాల అరుదైన రికార్డు..!

యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ యర్రా మణీంద్రబాబు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కర్నూలులోని సంబంధిత థియేటర్ సీసీటీవీ ఫుటేజీ, స్క్రీనింగ్ వివరాలు, టికెట్ బుకింగ్ రికార్డులను పరిశీలించి సినిమాను రికార్డు చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే ఆ నాలుగు సినిమాలను అప్‌లోడ్ చేసిన వెబ్‌సైట్ నిర్వాహకులపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

నాడు వైఎస్సార్ ఆహ్వానిస్తే...

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

ఓటమిని జీర్ణించుకోలేక బొత్స...

విజయనగరం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి...

స్టాక్ మార్కెట్లోకి APMDC.....

ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సరికొత్త చరిత్ర...

చంద్రబాబు, లోకేష్‌తో భేటీ...

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం...

ఒకే ఇంట్లో ఎమ్మెల్యే.....

ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు...

ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల...

IndiaStat, Projects Today గణాంకాల ప్రకారం,...

పోల్స్