Thursday, November 5, 2026 06:06 PM
Thursday, November 5, 2026 06:06 PM

ఇది కదా కావాల్సింది.. సుధారెడ్డి ధైర్యానికి వైసీపీ షాక్..!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ తిరుపతి రూరల్ పరిధిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఉద్దేశించి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ అభ్యర్థి జనరల్ ఏజెంట్ పులివర్తి సుధారెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద అకారణంగా గొడవలు సృష్టించవద్దని, టీడీపీ శ్రేణులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఎన్నికల వేళ చెవిరెడ్డిని వెంబడిస్తూ ఆమె చూపిన ధైర్యం, మాట్లాడిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Read : విశాఖ జగన్ కు ఎందుకు కలగానే మిగిలిపోతోంది..?

ఉదయం మంగళం ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లిన సమయంలో ఉద్రిక్తత నెలకొనడంతో సుధారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి తాను వెళ్తూ పకడ్బందీగా వ్యవహరించారు. నేను ఎస్కార్ట్.. ఈ రోజు అంతా చెవిరెడ్డి అన్న వెంటే ఉంటా. నిన్ను ఒంటరిగా వదిలేస్తే గొడవలు చేస్తావ్.. అంటూ ఆమె ముఖం మీదే స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతోనే అల్లర్లు జరగకుండా తాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Also Read : రామాయణ పార్ట్1 రివ్యూ : అత్యాధునిక దృశ్య కావ్యం

ఈ పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా సుధారెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రత్యర్థి వర్గం ఎంతలా ఒత్తిడి తీసుకురావాలని చూసినా భయపడకుండా, ఒంటరి మహిళగా నిలబడి ధైర్యంగా నిలదీసిన తీరు అమోఘమంటూ కూటమి శ్రేణులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వైసీపీ నేతలు సైతం ఆమె ధైర్యం చూసి కంగుతిన్నారు. ఆమె తెగింపు చూసి, చెవిరెడ్డి కూడా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. క్షేత్రస్థాయిలో అరాచకాలకు తావులేకుండా ఒక అడ్డంకిలా నిలిచి, కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపిన సుధారెడ్డి నిజమైన నాయకురాలంటూ ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల్లో ఆమెకు మద్దతుగా పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరుమల లడ్డూ కల్తీ...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుమల...

విశాఖ జగన్ కు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

రామాయణ పార్ట్1 రివ్యూ...

భారతీయులకు చిరపరిచితమైన రామాయణ గాథను భారీ...

ఏ ఎన్నిక జరిగినా...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

ఆధారాలు ఇచ్చేస్తా.. ఈడీ...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్...

యువగళం హామీ నిలబెట్టుకున్న...

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న...

పోల్స్