Thursday, October 29, 2026 09:02 PM
Thursday, October 29, 2026 09:02 PM

సూపర్ ఎల్‌నినో ముప్పు.. భారత్‌లో 55 వేల ప్రాణాలకు గండం?

భారత్‌కు సూపర్ ఎల్‌నినో రూపంలో తీవ్రమైన ఉష్ణ ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. అక్టోబర్ 2026 నుంచి మార్చి 2027 మధ్య భారత దేశంలో సుమారు 55 వేల తీవ్ర ఎండల వలన మరణాలు సంభవించే అవకాశం ఉందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అంచనా వేసింది. వీటిలో ఎక్కువ మరణాలు మార్చిలో సంభవించవచ్చని కూడా పేర్కొంది. ఆ సంస్థ రూపొందించిన ‘ఎల్‌నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ ఈ వివరాలను వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా జూన్ 2026 నుంచి మార్చి 2027 వరకు ఎల్‌నినో కారణంగా పెరిగే తీవ్ర ఉష్ణోగ్రతలతో సుమారు 8.57 లక్షల అదనపు మరణాలు సంభవించవచ్చని ట్రాకర్ అంచనా వేస్తోంది. ఇందులో అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఆరు నెలల్లోనే సుమారు 3.73 లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే ఇవి గణాంక నమూనాల ఆధారంగా రూపొందించిన అంచనాలు. అధికారికంగా నమోదైన మరణాల లెక్కలుగా వీటిని పరిగణించకూడదు.

Also Read : చంద్రబాబు విజన్‌పై కేటీఆర్ ప్రశంసలు..!

నైజీరియా తర్వాత భారత్‌పైనే అధిక ప్రభావం

రాబోయే ఆరు నెలల అంచనాల్లో నైజీరియా అత్యధిక ముప్పును ఎదుర్కొంటోంది. అక్కడ సుమారు 56 వేల అదనపు ఉష్ణ మరణాలు సంభవించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఆ తర్వాత భారత్‌లో 55 వేలు, ఇండోనేషియాలో 29 వేలు, బ్రెజిల్‌లో 19 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు.

ముందస్తు చర్యలకు ఉపయోగపడే ట్రాకర్

ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాలు, ప్రావిన్సుల స్థాయిలో ఉష్ణ సంబంధిత మరణాల ముప్పును గుర్తించేందుకు ఈ ట్రాకర్‌ను రూపొందించారు. ఇప్పటికే నమోదైన ఉష్ణోగ్రతలు, రానున్న నెలల వాతావరణ అంచనాలు, ఉష్ణోగ్రతలకు మరణాలతో ఉన్న సంబంధాన్ని విశ్లేషించి అంచనాలను సిద్ధం చేస్తున్నారు. కొత్త సమాచారం అందుబాటులోకి వచ్చినకొద్దీ వీటిని ప్రతి నెలా సవరిస్తారు.

Also Read : పింఛన్లను అడ్డుకునేందుకు వైసీపీ సరికొత్త కుట్ర..?

తీవ్ర వేడి వల్ల ప్రాణనష్టం ఎక్కువగా సంభవించే ప్రాంతాలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రభుత్వాలు సకాలంలో చర్యలు తీసుకోవచ్చని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సహవ్యవస్థాపకుడు మైఖేల్ గ్రీన్‌స్టోన్ తెలిపారు. ప్రాణనష్టం జరగకముందే వనరులను అవసరమైన ప్రాంతాలకు మళ్లించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని వివరించారు.

అంచనాలు ఎందుకు పెరిగాయి?

గత సెప్టెంబర్ నివేదికతో పోలిస్తే తాజా మరణాల అంచనా పెరిగింది. అంచనా కాలపరిమితిలో మార్చిని చేర్చడంతోపాటు, ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో ముందుగా ఊహించినదానికంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఇందుకు ప్రధాన కారణాలని పరిశోధకులు వివరించారు.

ముందస్తు ఉష్ణ హెచ్చరికలు, తాగునీటి సదుపాయాలు, చల్లదనాన్ని అందించే కేంద్రాలు, వైద్య సేవల విస్తరణ, ఆరుబయట పనిచేసే కార్మికులకు రక్షణ చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. అధిక ముప్పు ఉన్న ప్రాంతాల్లో చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

చంద్రబాబుపై కయ్యానికి కాలు...

జూనియర్ ఎన్టీఆర్ మామ గారు చంద్రబాబుపై...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక...

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి...

చంద్రబాబు విజన్‌పై కేటీఆర్...

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక...

పింఛన్లను అడ్డుకునేందుకు వైసీపీ...

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1వ తేదీన జరగబోయే...

కూటమిలో రెబల్స్‌పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగబోయే పట్టణ,...

బయట అర్నాబ్ బీభత్సం.....

రాష్ట్రం అర్నాబ్ తుఫాన్ ముప్పుతో వణికిపోతోంది....

పోల్స్