విజయవాడలో వంగవీటి రాధ గెలుపు ఖాయం.. మెజారిటీ పైనే కూటమి పార్టీల పెద్దలు దృష్టి పెట్టారు. ఇక రెండో స్థానం కోసం మాత్రమే వైసీపీ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు మధ్య పోటీ జరుగుతుందనే మాట బాగా వినిపిస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీల మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నాయనే మాటా బాగా వినిపిస్తోంది. కూటమి పార్టీల పెద్దలు కూడా రాధ గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే వచ్చిన సర్వేల నివేదికల ప్రకారం.. రాధకు మూడు లక్షలకు పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
Also Read : జగన్ అడ్డాలో కూటమి పాగా.. పులివెందులలో వైసీపీకి షాక్!
మరోవైపు రెండో స్థానం కోసం వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు మధ్య పోటీ జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అభిమాన ఓటర్ల నుంచి, కమ్మ సామాజిక వర్గం ఓటర్ల నుంచి ఆశించిన స్థాయిలో ఏబీవీకి మద్దతు లభించడం లేదని సర్వే సంస్థల నివేదిక. అటు ప్రధాన పార్టీలు నిర్వహిస్తున్న ఐవీఆర్ఎఫ్ సర్వేలో కూడా కూటమి అభ్యర్థి రాధ గెలుపు ఖాయమని తేల్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏబీవీకి మద్దతిస్తున్న వామపక్షాల నాయకులే.. ఈ ఎన్నికలో ఏబీవీకి 80 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. విజయవాడ నగర పరిధిలో సుమారు 8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
Also Read : షర్మిలకి అండగా లోకేష్.. సంచలన ట్వీట్..!
ప్రధాన పార్టీలతో పాటు, రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం రాధకు 3 లక్షల పైగా మెజారిటీ ఖాయమంటున్నారు. అంటే.. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కష్టమనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. పార్టీల బలాబలాలు, అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం, సామాజిక సమీకరణాలు, ఓటర్ల పోలింగ్ శాతం, చివరి నిమిషంలో మారే రాజకీయ పరిణామాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి వంగవీటి రాధాకు మూడు లక్షలకు పైగా మెజారిటీ వస్తుందన్న ప్రస్తుత సర్వేను కేవలం ఆధారిత అంచనాగా మాత్రమే చూడాలి.
Also Read : అంతా అయిపోయింది అన్న.. ఇప్పుడెందుకు చెప్పు..!
రాధ గెలుపు గురించి ఏ ఒక్కరికి అనుమానం లేదు. ఆయన గెలుపును ఏ ఒక్కరూ ఆపలేరని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులే ఆఫ్ ధి రికార్డుగా చెబుతున్నారు కూడా. వంగవీటి మెజారిటీ ఎన్ని లక్షలు.. అనే విషయంపై మాత్రమే విజయవాడలో చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ మరో విషయంపై కూడా చర్చ నడుస్తోంది. అదేమిటంటే.. చివరి నిమిషంలో ఏబీవీకి వైసీపీ నేతలు తెర వెనక నుంచి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అదే జరిగితే మాత్రం.. రాధకు ఏబీవీ గట్టి పోటీ ఇస్తారనే మాట బాగా వినిపిస్తోంది.


