Tuesday, October 27, 2026 07:02 PM
Tuesday, October 27, 2026 07:02 PM

జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా..?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తయ్యింది. ఏకగ్రీవాల జాబితా రావడంతో.. మిగిలిన చోట్ల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న మునిసిపల్ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. 30న ఓట్ల లెక్కింపు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే వైసీపీ నేతలు సుప్రీం కోర్టుకు వెళ్లడం.. నామినేషన్లు వేయనీయటం లేదని వాదించడం.. దీంతో.. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. తుది జాబితా ప్రకటన ఆపాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఇప్పుడు ఇదే ఎన్నికల వాయిదాకు కారణం అంటున్నారు.

Also Read : డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి!

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ మారే అవకాశం ఉందని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. అక్కడి నుంచి ప్రచార ఘట్టం ఊపందుకుంటుంది. వచ్చే నెల మూడో తేదీన అంటే సరిగ్గా వారం తర్వాత వచ్చే మంగళవారం పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్నందున ఆ రెండింటిలో ఏదో ఒక కార్యక్రమాన్ని వాయిదా వేయకతప్పని పరిస్థితి.

Also Read : ఒంగోలు పార్లమెంట్ లో తేలిన కూటమి పంచాయితీ..!

వాస్తవానికి స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 28న, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను సవరించి కొద్దిరోజులు వెనక్కి జరపాల్సి వచ్చింది. దాంతో ఆ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ ఒకటి నుంచి నవంబర్ మూడవ తేదీకి మారింది. కానీ షెడ్యూల్ ప్రకారం అదే రోజు జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ జరగాల్సి ఉంది. మున్సిపల్ కౌంటింగ్, జెడ్‌పీటీసీ పోలింగ్ రెండూ ఒకేరోజు జరిపితే బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ అధికారులను సర్దుబాటు చేయడం కష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను మరో రోజుకు షెడ్యూల్ చేయాలని సూచిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఐదో తేదీన జరగాల్సిన జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కూడా వెనక్కి వెళ్లక తప్పదు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆ ఆస్తుల్లో నీకు...

వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన...

జగన్ అడ్డాలో కూటమి...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్...

షర్మిలకి అండగా లోకేష్‌.....

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్...

ఒంగోలు పార్లమెంట్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఒంగోలు...

అంతా అయిపోయింది అన్న.....

చేతులు కాలిన తర్వాత.. ఆకులు పట్టుకున్నట్లుగా...

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఏం...

ప్రశాంతంగా హైదరాబాద్ నగరం సేద నిద్రపోతున్న...

పోల్స్