Wednesday, September 9, 2026 05:00 PM
Wednesday, September 9, 2026 05:00 PM

క్షణాల్లో మాట మార్చేసిన వైసీపీ.. ఏందయ్యా ఇది..!

రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యం. ఒక మాట చెబితే.. దానికే కట్టుబడి ఉండాలి. అలాగే తమతో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఒకలా ఉండకూడదు అనేది రాజకీయ నేతలకే కాదు.. అందరికీ వర్తించే సూత్రం. కానీ వైసీపీ నేతలు, అభిమానుల తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ నేతలకు ఎలాంటి నియమాలు లేవు. వైసీపీ నేతలు, కార్యకర్తల తీరు అంతా ఒకటే. అదే ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న.. అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా మరోసారి తమ నైజం ఇదే అని రుజువు చేశారు కూడా.

Also Read : వైసీపీ హయాం మద్యం రవాణా స్కామ్‌లో కీలక పరిణామం..!

విజయనగరం జిల్లాలో తొలి నుంచి వైసీపీ వెంటే ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ మేనల్లుడిగా గుర్తింపు తెచ్చుకున్న చిన్న శ్రీను.. ఆ తర్వాత మేనమామ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉన్నారు. బొత్స గెలుపులో కీలకంగా వ్యవహరించారు. అయితే మేనమామతో ఏర్పడిన విభేదాల వల్ల వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను.. టీడీపీలో చేరారు. వైసీపీ అధినేతను పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా తనకు పదవులు ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. మర్యాద పూర్వకంగా రాజీనామా లేఖ రాసి.. ఎంతో హుందాగా వ్యవహరించారు. ఏ ఒక్కరిపైనా ఆరోపణలు చేయలేదు.. ఏ ఒక్కరి పైనా విమర్శలు చేయలేదు.

అయితే చిన్న శ్రీను రాజీనామా చేసిన వెంటనే.. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. నోటికి వచ్చినట్లుగా బూతులతో రాతలు రాస్తున్నారు. నిన్నటి వరకు చిన్న శ్రీను వల్లే పార్టీ నిలబడింది అని గొప్పగా చెప్పిన వారంతా.. ఇలాంటి వాళ్లు ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నారు. వాస్తవానికి వైసీపీ అంటేనే.. కాంగ్రెస్ జూనియర్ అంటారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే.. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలంతా వైసీపీలోనే చేరారు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మల్లాది విష్ణు, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆదిమూలపు సురేశ్, కాకాణి గోవర్థన్ రెడ్డి.. ఇలా ఒకరేమిటి.. ప్రస్తుతం వైసీపీలో చక్రం తిప్పుతున్న నేతలంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే.

Also Read : 20 కోట్లు ఆఫర్.. సెక్యూరిటీ కోసం చంద్రబాబుకు దస్తగిరి రిక్వెస్ట్.!

కానీ వైసీపీ అభిమానులు మాత్రం.. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వైసీపీ రాజకీయ నేతలను తయారు చేసే పార్టీ అని.. చిన్న శ్రీను లాంటి వారు ఎంత ఉన్నా, పోయినా.. పార్టీకి ఎలాంటి నష్టం లేదంటున్నారు. “పార్టీ ఒక్కడితోనే స్టార్ట్ అయ్యింది.. 2019లో గెలిచినా జగనన్న వల్లే.. 2024లో ఓడినా కూడా జగనన్న నే అన్నారు.. ఇక్కడ లీడర్స్ కాదు జగనన్న సుప్రీమ్.. మిగతా పార్టీలు లీడర్స్ వల్ల గెలుస్తారేమో కానీ.. ఇక్కడ మనకి జగనన్న మాత్రమే అన్నీ.. ఇదే పాజిటివ్ థాట్స్ మైండ్‌లో పెట్టుకుని అన్న కోసం పని చేద్దాం..”, “కూతురికి మేయర్ పదవి ఇస్తా అనగానే వెళ్ళిపోయాడు అలాంటి వాడిని ఇన్ని రోజులు మోసావ్ అన్న .. 2024 ఎలక్షన్ తరువాత ఈయన పెద్దగా నియోజకవర్గంలో తిరిగింది లేదు.. కూతురు చరిష్మాతో పబ్బం గడుపుకున్నాడు.. అమ్ముడుపోయే వీర నాయకుడు.. నాయకులని తయారు చేయడం నీకు కొత్త కాదు.. ఎవరిని చేస్తున్నారు అనేది చూసుకుని చేయండి ఈసారి..” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక కొందరైతే.. చిన్న శ్రీను వల్ల వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంత మంది వెళ్లారో.. చిన్న శ్రీను వల్ల టీడీపీ నుంచి వైసీపీలోకి ఎంత మంది వస్తారో చూద్దాం.. అంటూ సవాల్ చేస్తున్నారు కూడా. గంట క్రితం వరకు మా శీనన్న.. మా సతన్న మేనల్లుడు.. మా శీనన్న ఉంటే చాలు.. అని గొప్పగా మాట్లాడిన వారంతా.. ఇలా నాలుక మడత పెట్టడం చూసి.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమ్మవారి బంగారానికే భద్రత...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ...

స్థానిక ఎన్నికలు.. ‘మినీ...

స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో...

ఏపీ పర్యాటక రంగానికి...

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి...

వైసీపీ హయాం మద్యం...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో...

పాదయాత్ర 2.O ముహూర్తం...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సరికొత్త...

20 కోట్లు ఆఫర్.....

మాజీ మంత్రి, జగన్‌ బాబాయి YS...

పోల్స్