Tuesday, May 19, 2026 03:23 PM
Tuesday, May 19, 2026 03:23 PM

ముంబై హైకోర్ట్ లాయర్ పై రే*ప్.. మ్యాట్రిమొనియల్ సైట్ నమ్మి..!

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో ఆందోళన పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఓ ఘటన సంచలనంగా మారింది. ముంబై హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక మహిళా న్యాయవాదిపై కదులుతున్న కారులో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మ్యాట్రిమోనియల్ సైట్ లో ఏర్పడిన పరిచయం కాస్తా ఒక మహిళా లాయర్ జీవితంలో నరకాన్ని మిగిల్చింది. పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేయిస్తున్నారు.

Also Read : అవును.. వాళ్లిద్దరు కలిశారు.. మరి వీళ్లిద్దరూ..?

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. బాధితురాలు అసలు పాట్నాకు చెందిన మహిళ కాగా, పూణేలోనే లా పూర్తి చేసి ప్రస్తుతం ముంబై హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వృత్తిపరమైన పనుల నిమిత్తం ఆమె పూణేకు రాగా ఈ ఘోరం జరిగింది. ఆదివారం సాయంత్రం ఆమె ముంధ్వాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌ లో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని కలవడానికి వెళ్లారు. అయితే, ఆ వ్యక్తి తనతో పాటు మరో ఇద్దరు మహిళలతో కలిసి వచ్చి, కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోగా.. ఆ తర్వాత అదే హోటల్‌ లో పక్క టేబుల్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులతో ఆమెకు పరిచయం ఏర్పడింది.

Also Read : పాక్ ఉగ్రవాదులకు లైవ్ కవరేజ్.. యూపీలో భారీ కుట్ర..!

అందరూ కలిసి పూణే రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక పబ్‌ కు వెళ్లాలని డిసైడ్ అయి వారి కారులో బయలుదేరారు. ఆ ప్రయాణంలో కదులుతున్న కారులోనే నిందితులు ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా నిందితులు తమ మరో ఇద్దరు స్నేహితులకు స్పీకర్‌ ఫోన్‌ లో కాల్ చేసి మహిళను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందారు. దీనిపై సదరు లాయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫోన్‌లో మాట్లాడిన వారిని కూడా అక్కడికి పిలిపించి క్షమాపణ చెప్పాలని నిలదీశారు. కారు ఆపి కిందకు దిగిన తర్వాత తీవ్ర వాగ్వాదం జరగడంతో నిందితులు ఆమె పర్సును రోడ్డుపై పడేసి అక్కడి నుండి పరారయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

సమన్యాయం అంటే ఇదేనేమో..!

“ఒక కేసు అనేక ప్రశ్నలు, అనేక...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు...

అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న...

పోల్స్