Sunday, July 12, 2026 08:55 AM
Sunday, July 12, 2026 08:55 AM

ఇదేం టీంరా బాబూ.. చెన్నైపై ఫ్యాన్స్ ఫైర్..!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్, ప్రస్తుత సీజన్‌ లో వరుసగా మూడవ ఓటమి మూటగట్టుకుంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ లో చెన్నై ఆటతీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 43 పరుగుల తేడాతో ఓడిపోవడం సంగతి పక్కన పెడితే.. చెన్నై కనీసం పోరాడలేకపోవడం ఆందోళనకరంగా మారింది. మొదట బౌలింగ్ ఎంచుకున్న చెన్నై, ఆర్సీబీ బ్యాటర్ల దూకుడు ముందు తేలిపోయింది.

Also Read  : ఈసారి మాకు రెండు టికెట్లు ఇవ్వాలి.. లేదంటే..!

చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌ కు అనుకూలమని తెలిసి కూడా, చెన్నై బౌలర్లు కనీసం శ్రమించకపోవడం గమనార్హం. టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ వంటి బ్యాటర్లు చెన్నై బౌలింగ్‌ ను చీల్చి చెండాడారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో విఫలమవ్వడం కావడంతో.. ఆర్సీబీ 250 పరుగుల భారీ స్కోరును సాధించింది. సరైన బౌలర్ జట్టులో లేకపోవడం కూడా చెన్నైకి పెద్ద సమస్యగా మారింది. 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పుడు కనీసం పవర్ ప్లేలోనైనా దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. కానీ చెన్నై టాప్ ఆర్డర్ తడబడింది.

Also Read  : ఏపీలో మరో రేపిస్ట్ సంగతేంటి..? సేమ్ సీన్ రిపీట్ అవుతుందా..?

ఓపెనర్ లు, వన్ డౌన్ లో వచ్చిన ఆయుష్ మాత్రే ఫెయిల్ కావడం చెన్నైపై తీవ్ర ప్రభావం చూపింది. మిడిల్ ఆర్డర్ లో సర్ఫరాజ్ ఖాన్ (50), ప్రశాంత్ వీర్ (43) పోరాడినప్పటికీ, మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోయింది. కేవలం బౌలింగ్, బ్యాటింగ్‌ లోనే కాకుండా.. ఫీల్డింగ్‌ లో కూడా చెన్నై ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. కీలకమైన సమయంలో క్యాచ్‌ లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ చేయడం ఆర్సీబీకి కలిసి వచ్చింది. వరుసగా మూడు మ్యాచ్‌ ల్లో ఓడిపోయిన చెన్నై, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

దూకుడు పెంచిన కవితక్క.....

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.....

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా...

పోల్స్