నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు.. అది నిమిషాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అయిపోతుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఆమె షేర్ చేసిన ఓ చిన్న యానిమేషన్ వీడియో చూసి అభిమానులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా ‘మేము ముగ్గురం అయ్యాం’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ చుట్టూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
Also Read : అంచనాలు పెంచిన ‘రామాయణ’ టీజర్ బడ్జెట్ వింటే షాక్..!
ఇటీవల హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న రష్మిక.. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ యానిమేషన్ వీడియోలో రష్మిక, విజయ్ దేవరకొండ కార్టూన్ రూపంలో కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో ఒక చిన్న పొద్దుతిరుగుడు పువ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వీడియో చూసిన వెంటనే ఇది గుడ్ న్యూస్‌కు సిగ్నలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. రష్మిక ప్రెగ్నెంటా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేయడంతో ఈ వార్త క్షణాల్లో వైరల్ అయ్యింది.
Also Read : బ్రేకింగ్; ఏపీ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్..!
పెళ్లి ఫోటోలు ఇంకా కళ్లముందే కదులుతుండగా.. ఇంతలోనే ఈ తీపి కబురు ఏంటా అని అంతా ఆరా తీశారు. అయితే ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ పోస్ట్‌కు రష్మిక వ్యక్తిగత జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. రష్మిక చాలా కాలంగా ‘రూ’ అనే పొద్దుతిరుగుడు పువ్వు క్యారెక్టర్‌తో ఒక ప్రత్యేక యానిమేషన్ ప్రపంచాన్ని నిర్మిస్తోంది. తన వ్యక్తిత్వంలోని పాజిటివిటీని, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ ప్రాజెక్ట్ వివరాలతో స్పష్టమైపోయింది. ప్రముఖ కంటెంట్ ప్లాట్‌ఫామ్ ‘టెర్రబిలీ టైనీ టైల్స్’ సహకారంతో ఈ యానిమేషన్ సిరీస్ రూపొందుతోంది.
‘రష్మిక & రూ’ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ఈ కథలకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో రష్మిక, రూ మధ్య ఉన్న అనుబంధాన్ని క్యూట్ స్టోరీల రూపంలో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ డిజిటల్ ఫ్యామిలీలోకి విజయ్ దేవరకొండను కూడా ఆహ్వానించారు. అంటే రష్మిక, రూ తో పాటు ఇప్పుడు విజయ్ కూడా ఆ యానిమేషన్ ప్రపంచంలో భాగమయ్యారు. దీంతో రష్మిక ఇచ్చిన క్యాప్షన్ కేవలం ఈ క్రియేటివ్ అనౌన్స్‌మెంట్ కోసమేనని అర్థమవుతోంది. వీడియోలో కనిపించిన గుడ్డు బొమ్మ, సన్ ఫ్లవర్ వంటి ఎలిమెంట్లు కేవలం యానిమేషన్ కథలో భాగం మాత్రమే. వీటిని వాస్తవ జీవితంతో లింక్ చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆ చిన్న క్లిప్ అభిమానుల్లో పెద్ద ఎత్తున డిస్కషన్లకు దారి తీసింది. సెలబ్రిటీలు చేసే చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఈ ఇన్సిడెంట్ మరోసారి నిరూపించింది. విజయ్, రష్మిక ఇద్దరూ రణబాలి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

