Tuesday, July 7, 2026 09:15 PM
Tuesday, July 7, 2026 09:15 PM

చెవిరెడ్డిని ఊహించని దెబ్బ కొట్టిన జగన్..!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా భావిస్తున్న వ్యక్తుల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒకరు. మద్యం కుంభకోణానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నగదును దాచిపెట్టిన విషయంలో, ఇతర రాష్ట్రాలకు తరలించే విషయంలో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దాదాపు 200 రోజులకు పైగా ఆయన జైలు జీవితాన్ని గడిపారు. దీనివల్ల వ్యక్తిగతంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నష్టపోయారు. ఇప్పటికి కూడా ఆయనకు పూర్తిస్థాయిలో ఉపశమనం అనేది రాలేదు. ఈ కేసు ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.

Also Read : అనంతబాబును కాపాడుతున్నది ఎవరూ..?

ఈ సమయంలో చెవిరెడ్డి వేస్తున్న అడుగులతో మద్యం కేసులో ఉన్న వారికి కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఈ కేసులో ఉన్న నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. వాళ్లకు బెయిల్ ఇవ్వద్దని చెవిరెడ్డి.. ఇంప్లిడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అందులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ కూడా ఉంది. వీళ్ళ ముగ్గురు వైసీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులు. అయితే ఇప్పుడు వైసీపీ అధిష్టానం చెవిరెడ్డి అందించే న్యాయ సహాయంతో పాటుగా.. రాజకీయ సహాయం విషయంలో కూడా వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

Also Read : Poll : అయేషా మీరా కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా?

పార్టీ అధిష్టానం నుంచి చెవిరెడ్డికి వెళ్లిన సమాచారం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారింది. లాయర్ల విషయంలో చెవిరెడ్డి వ్యక్తిగతంగా చూసుకోవాలని.. పార్టీ నుంచి సహకారం ఉండదని.. ఆ పార్టీ కీలక వ్యక్తి ఒకరు చెవిరెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చంద్రగిరి నియోజకవర్గంలో త్వరలో కీలక మార్పులు జరగబోతున్నాయని కూడా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఇదే గనుక క్షేత్రస్థాయిలో అమలు జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉండవచ్చు. అటు చెవిరెడ్డి కూడా వైసీపీ పెద్దలతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్