Wednesday, May 6, 2026 08:16 PM
Wednesday, May 6, 2026 08:16 PM

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటీ..? గుర్తించటం ఎలా ?

గర్భాశయ క్యాన్సర్.. మహిళల్లో సాధారణంగా కనపడే క్యాన్సర్ ఇది. వాస్తవానికి గుర్తించడం కాస్త కష్టమే అయినా నివారణ ఉండటం ఇక్కడ కలిసి వచ్చే అంశం. అసలు దాని లక్షణాలు ఏంటీ అనేది చాలా మందికి అవగాహన ఉండదు. చిన్న చిన్న లక్షణాలు కనపడి.. అవి చాలా సాధారణంగా ఉంటాయి. అసలు ఆ లక్షణాలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.

Also Read : వైరస్ తో వణికిపోతున్న అమెరికా.. పిల్లలు జాగ్రత్త..!

పీరియడ్స్ మధ్య, సెక్స్ తర్వాత లేదా రుతుక్రమం ఆగిపోయిన తర్వాత రక్తస్రావం అనేది ఒక ప్రధాన హెచ్చరిక. ఈ క్యాన్సర్ యొక్క ప్రారంభ, అత్యంత గుర్తించదగిన లక్షణం. నీరు, ఘాటు వాసనతో లేదా రక్తంతో కూడిన నిరంతర, అసాధారణమైన స్రావం గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది. పీరియడ్స్ తో సంబంధం లేని, చెప్పుకోలేని నొప్పి కూడా ఒక లక్షణమే. లైంగిక చర్య సమయంలో నొప్పి కణితులు లేదా గర్భాశయ వాపు వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు వైద్య నిపుణుల దృష్టికి తీసుకువెళ్ళాలి.

క్యాన్సర్ మూత్రాశయంతో సహా సమీపంలోని కణజాలాలకు వ్యాపించినప్పుడు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట లేదా అసౌకర్యంగా ఉంటుంది. తరచుగా మూత్ర విసర్జన చేయడం కూడా ఒక సంకేతం కావచ్చు. ఆహారం లేదా వ్యాయామంలో మార్పులు లేకుండా బరువు గణనీయంగా తగ్గడం, నిరంతర అలసట, వంటివి అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటాయి. గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తి చెందుతున్నప్పుడు, అది చుట్టుపక్కల నరాలు లేదా శోషరస కణుపులపై ఒత్తిడి తెస్తుంది, దీనివల్ల కాళ్ళలో వాపు, నడుము నొప్పి లేదా నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది.

Also Read : రప్ప రప్ప ఆపొద్దు.. కార్యకర్తలకు జగన్ సిగ్నల్..!

గర్భాశయంలో అసాధారణ కణజాలం ఉంటే డౌచింగ్ వల్ల కలిగే చిన్న గాయం లేదా సాధారణ స్త్రీ జననేంద్రియ పరీక్ష వల్ల కూడా రక్తస్రావం జరగవచ్చు. గర్భాశయ క్యాన్సర్ లో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే దీనిని ప్రారంభ దశలో గుర్తించడం కష్టం. దీనికి సమర్ధవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంటుంది. లక్షణాల గురించి అవగాహన పెంచుకుంటే పరిష్కారం ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్