Sunday, September 20, 2026 08:08 AM
Sunday, September 20, 2026 08:08 AM

బాక్సాఫీస్ ను దున్నేస్తున్న దురంధర్.. నాలుగో వారం కూడా..!

సౌత్ సినిమా డామినేషన్ తో అల్లాడిపోతున్న బాలీవుడ్ కు.. దురంధర్ సినిమా కంప్లీట్ బూస్ట్ ఇచ్చింది. నలుగురు స్టార్ లతో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఆదిత్య ధర్.. బాక్సాఫీస్ ను షేక్ ఆడించాడు. రణవీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా మినహా ఆ సినిమాలో తెలిసిన ముఖాలు లేకపోయినా.. హీరో లుక్స్, సినిమా టేకింగ్, స్టోరీ లైనప్ కు పడిపోయారు ఆడియన్స్. తెలుగు రాష్ట్రాల్లో కూడా బాష రాకపోయినా ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఇక నాలుగో వారం కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుంది.

Also Read : వందేభారత్ స్లీపర్ ముహుర్తం ఫిక్స్.. ఆ రూట్‌లోనే..!

డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా.. నాల్గవ వారంలో కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 27వ రోజు కంటే 28వ రోజు ఎక్కువ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. నాలుగు వారాల తర్వాత, దేశ వ్యాప్తంగా.. రూ. 784.50 కోట్లు వసూలు చేసింది. జియో స్టూడియోస్ లెక్కల ప్రకారం, ఈ చిత్రం గురువారం నాడు రూ. 17.60 కోట్లు వసూలు చేసింది. బుధవారం ధురంధర్ రూ. 12.40 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. ఈ చిత్రం మొదటి వారంలో రూ.218 కోట్లు, రెండవ వారంలో రూ.261.5 కోట్లు వసూలు చేసింది.

Also Read : కోహ్లీని ఊరిస్తోన్న 2026.. గోల్డెన్ ఛాన్స్ లే..!

మూడవ వారంలో రూ.189.3 కోట్లకు పడిపోయింది. విశేషమేమిటంటే, నాల్గవ వారంలో రూ.115.70 కోట్లు వసూలు చేసింది. ఇక మన తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉన్న చిత్ర యూనిట్.. మరో రెండు మూడు వారల పాటు సినిమా నడిపించాలని భావిస్తోంది. పాక్ లో భారత వ్యతిరేక కుట్రలను చేధించేందుకు.. భారత నిఘా సంస్థలు ఆపరేషన్ దురంధర్ ను చేపడతాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల గుండా భారత నిఘా అధికారి.. పాక్ భూభాగంలోకి అడుగు పెడతాడు. అనంతరం అక్కడ రహ్మాన్ దికాయత్ గ్యాంగ్ లో చేరి.. వారిని అంతం చేసే ప్రణాళిక అమలు చేస్తూ ఉంటాడు. రహ్మాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా, చౌదరి అస్లాం పాత్రలో సంజయ్ దత్, ఐఎస్ఐ ఏజెంట్ గా అర్జున్ రాంపాల్ ఆకట్టుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్